e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జోగులాంబ(గద్వాల్) పాలమూరులో మెరుగైన వైద్య సేవలు

పాలమూరులో మెరుగైన వైద్య సేవలు

  • రోగులు, సహాయకుల కోసమే పార్కు
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, జూలై 24 : పాలమూరు లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, హైదరాబాద్‌కు దీటుగా దవాఖానలో ఏర్పాట్లు చేశామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ దవాఖాన ముందు నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దవాఖాన ముందు భాగంలో పెద్ద ఎత్తున పార్కును అభివృద్ధి చేయాలన్నారు. దవాఖానకు వచ్చే రోగులు, సహాయకులు విశ్రాంతి పొందేందుకు ఏర్పాట్లు చేయాలని, పార్కు పనులను త్వరగా పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం స్వయం ఉపాధి సంఘా లు, నిరుద్యోగ మహిళలకు చేపల ఉత్పత్తులు నిర్వహించేందుకుగానూ జాతీయ మత్స్య, అభివృద్ధి సంస్థ సహకారం తో 60 శాతం సబ్సిడీపై మంజూరైన వాహనాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ రాంకిషన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత
జిల్లా కేంద్రంలోని తాయేబ్‌నగర్‌కు చెందిన ఆయేషా తహిసిన్‌ రూ.2.50 లక్షలు, చిన్నదర్పల్లికి చెందిన సంతోష్‌ కుమార్‌కు రూ.లక్ష సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌వోసీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పంపిణీ చేశారు.

- Advertisement -

రక్తదానం చేసిన ఉద్యోగులు
మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్న శ్రీ జయరామ మోటర్స్‌ అధినేత బెక్కరి రాంరెడ్డి ఆధ్వర్యంలో మారుతీ షోరూంలో ఏర్పా టు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. అలాగే రె డ్‌క్రాస్‌కు ఉచితంగా అందజేసిన అంబులెన్స్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. మహీంద్రా ట్రాక్టర్లను మంత్రి చేతులు మీదుగా వినియోగదారులకు అందజేశా రు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌, డీఎస్పీ శ్రీధర్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరా జ్‌, డా.శామ్యూల్‌, జగపతిరావు, మారుతీ షోరూం సీఈవో విక్రం యాదవ్‌, సెల్ఫ్‌ హెడ్‌ వేణుగోపాల్‌రెడ్డి, మేనేజర్‌ తుకారాం, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana