మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Jan 13, 2021 , 00:28:10

నేలపై కూర్చుంటే నిధులు వస్తాయా..

నేలపై కూర్చుంటే నిధులు వస్తాయా..

  • ఎమ్మెల్యే అబ్రహం
  • రసాభాసగా సర్వసభ్య సమావేశం

ఉండవెల్లి, జనవరి 12 : ప్రజాప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చుంటే నిధులు వస్తాయా అని ఎమ్మెల్యే అబ్రహం ప్రజాప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బీసమ్మ ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఆయా శాఖల వారీగా అధికారులు ప్రజలకు అందిస్తున్న పథకాలను వివరిస్తుండగా సర్పంచులు, ఎంపీటీసీలు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయడం లేదని నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి కింద కూర్చోని వారితో మాట్లాడుతూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సర్వసభ్య సమావేశానికి సహకరించాలని కోరారు. దీంతో ప్రజాప్రతినిధులు నిరస న విరమించి సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ నియోజకవర్గానికి 12 వందల డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాములమ్మ, వైస్‌ఎంపీపీ దేవన్న, ఎంపీడీవో శివరాజ్‌, అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo