బుధవారం 03 మార్చి 2021
Gadwal - Nov 14, 2020 , 03:11:09

పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్‌

పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్‌

  •  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల :  పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ అండగా ఉంటారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారు ఆడపిల్ల భారంగా భావించకూడదనే ఉద్ధేశంతోనే వారి పెండ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పేరుతో సాయం చేస్తున్నారని తెలిపారు. మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్ధేశంతో వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు  ఏర్పాటు చేసిందన్నారు. 

కాళోజీ ఆశయాలు కొనసాగించాలి

ప్రజాకవి కాళోజీ అని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలిపొద్దు ఉద్యమమే ఊపిరిగా భావించి జీవించిన ప్రజాకవి అని చెప్పారు. ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో  మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌ బాబర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, తాసిల్దార్‌ సత్యనారాయణరెడ్డి, ఆర్‌ఐ దేవేందర్‌రెడ్డి, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్‌, మనోరమ, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, శ్రీమన్నారాయణ, శ్వేత, రాజు, కృష్ణ, శ్రీనివాసులు, మహేశ్‌ నాయకులు రమేశ్‌నాయుడు, సాయిశ్యాంరెడ్డి, నాగులుయాదవ్‌, రాము, గోపాల్‌రెడ్డి జంబురామన్‌గౌడు, చక్రధర్‌, శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మన్న పాల్గొన్నారు.

 ఎమ్మెల్యేను సన్మానించిన  నాలుగో తరగతి ఉద్యోగులు

జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించగా, ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేను సన్మానించిన వారిలో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిశర్మ, సహాఅధ్యక్షుడు వాజేంద్రరావు, ఉపాధ్యక్షులు సురేశ్‌, వెంకట్రామిరెడ్డితోపాటు వెంకటస్వామి, వెంకటేశ్వరమ్మ ఉన్నారు.


VIDEOS

logo