e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు పర్యాటక ప్రాంతంగా పరకాల

పర్యాటక ప్రాంతంగా పరకాల

పర్యాటక ప్రాంతంగా పరకాల

పరకాల/ దామెర/ ఆత్మకూరు, ఏప్రిల్‌ 2 : పరకాల నియోజకవర్గంలో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వాటిని వెలికి తీసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలు, పరకాలలోని అమరధామం, ఆత్మకూరు మండలంలోని కోటగుళ్లను పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌రావు, స్థపతి శివనాగిరెడ్డితో కలిసి సందర్శించారు. చంద్రగిరి గుట్టపై ఉన్న పురాతన శ్రీచెన్నకేశవస్వామి ఆలయంతోపాటు శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, కోనేరులను పరిశీలించారు. ఆత్మకూరు మండలం కటాక్షపురం శివారులో ఉన్న కోటగుళ్ల(శ్రీరామలింగశ్వరస్వామి ఆలయం)ను సందర్శించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కనుమరుగైన కాకతీయుల కళా సంపదకు పూర్వ వైభవం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందు లో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నియోజకవర్గంలోని అతి ప్రాచీన కట్టడాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పటికే పరకాల పట్టణంలోని అమరధామాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి పర్యాటకశాఖ అధికారులు సందర్శించినట్లు చెప్పారు. రెండేళ్లలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి గుట్టలు 13వ శతాబ్దం నాటివని అక్కడి ఆనవాళ్లను బట్టి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ఏడు గుండాలు కొత్త రాతియుగం నాటివని, క్రీస్తుపూర్వం నాలుగువేల క్రితం నాటి నుంచి అవి ఉన్నట్లు తెలిపారు. చంద్రగిరి గుట్టలకు సుమారు ఆరు వేల ఏండ్ల చరిత్ర ఉందన్నారు.

ఈ ప్రాంతంలో 100 ఎకరాల భూమి అందుబాటులో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే, పరకాలలోని అమరధామం వద్ద అందుబాటులో ఉన్న స్థలంలో సౌండ్స్‌, లైటింగ్‌ సిస్టంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మల్లు నాయక్‌, బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్‌ ఇన్‌చార్జి శ్యాంసుందర్‌, చరిత్ర పరిశోధకుడు అరవింద్‌ ఆర్య, పరకాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితారామకృష్ణ, వైస్‌ చైర్మ న్‌ రేగూరి విజయ్‌పాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి దామెర ఎంపీపీ కాగితాల శంకర్‌, జడ్పీటీసీ కల్పనాకృష్ణమూర్తి, వైస్‌ ఎంపీపీ జాకీర్‌ అలీ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కృపాకర్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు అక్తర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లు రాజు, డైరెక్టర్‌ గుండా చంద్రమోహన్‌, ఉపసర్పంచ్‌లు మెంతుల రాజు, సాంబయ్య, ఆలయ అభివృద్ధి దాత సుబ్రహ్మణ్యచారి, ఎడ్ల రాము, సర్పంచ్‌ గోవిందు అశోక్‌ పరకాల రూరల్‌ సీఐ రమేశ్‌కుమార్‌, అర్చకులు దివి వెంకటజోగాచార్యులు, మురళీధరాచార్యులు, కేశవాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, ఆత్మకూరు ఎంపీపీ మార్క సుమలత, సర్పంచ్‌లు మచ్చిక యాదగిరి, రబీయాబీ హుస్సేన్‌, గూడెప్పాడ్‌ మార్కెట్‌ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, ఉపసర్పంచ్‌ గుండెబోయిన లావణ్య, మాజీ జడ్పీటీసీలు అంబాటి రాజస్వామి, లేతాకుల సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కక్కెర్ల రాజు, మార్త రజనీకర్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చూడండి..

దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్‌ టీకా పంపిణీ

తలైవాకు సినీ కిరీటం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పర్యాటక ప్రాంతంగా పరకాల

ట్రెండింగ్‌

Advertisement