దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్ టీకా పంపిణీ
కొవిడ్ టీకా పంపిణీ | దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గురువారం ఒకే రోజు రాత్రి 8 గంటల వరకు 17,47,094 మోతాదులను ఇచ్చినట్లు పేర్కొంది. జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయడంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ కార్మికులు, మార్చి నుంచి 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 45 ఏళ్లు దాటి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రం టీకాలు వేస్తోంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,75,36,392 మోతాలు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఇందులో 88,48,558 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 52,63,108 రెండో డోసు.. ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 93,99,776 ఫస్ట్ డోస్.. 39,18,646 మందికి సెకండ్ డోస్ వేసినట్లు చెప్పింది. అలాగే 45 ఏళ్లు పైబడిన 4,01,06,304 లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేశారు. గురువారం రాత్రి 8గంటల వరకు 17,47,094 డోసులు వేయగా.. 16,20,746 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 1,26,348 మందికి రెండో డోసు వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి
ఖమ్మంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఢిల్లీలో కరోనా పంజా.. సీఎం అత్యవసర సమావేశం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

