ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి

దక్షిణ మధ్య రైల్వే 2020-21 సంవత్సరంలో మొత్తం 750 కిలోమీటర్ల ట్రాక్‌లను విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర కలిపి మొత్తం 182 కిలోమీటర్ల ట్రాక్‌లను విద్యుదీకరించారు. నూతన సెక్షన్లలో 612కిలోమీటర్ల వరకు ట్రాక్‌ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్రకు సంబంధించిన ఐదు రైలు మార్గాల్లో కలిపి దాదాపు 164.09కిలోమీటర్ల మేరకు విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. తెలంగాణలో లింగంపేట – జగిత్యాల-మోర్తాడ్ మధ్య 50.50 కిలోమీటర్లు, వికారాబాద్-కోహిర్ మధ్య 44.82 కిలోమీటర్లు, మేడ్చల్-మనోహరాబాద్ మధ్య 13.08కిలోమీటర్లు, ఫలక్‌నుమా-ఉందానగర్ మధ్య 13.69 కిలోమీటర్లు, రాఘవాపురం-కోలనూర్ మధ్య 30కిలోమీటర్లు, కోలనూర్-పోటాకపల్లి మధ్య 12 కిలోమీటర్ల చొప్పున ట్రాక్‌ల విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రకటించారు. ట్రాక్‌ల విద్యుదీకరణతో ట్రాక్షన్ ఇంజిన్ అనుసంధాన ప్రక్రియలో పట్టే సమయాన్ని తగ్గించి రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

