e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News ముంబై, కోల్‌క‌తా.. ఈ న‌గ‌రాల‌న్నీ అమ్మ‌వారి పేరుతోనే వెలిశాయ‌ని తెలుసా?

ముంబై, కోల్‌క‌తా.. ఈ న‌గ‌రాల‌న్నీ అమ్మ‌వారి పేరుతోనే వెలిశాయ‌ని తెలుసా?

Dussehra special | vijaya dashami

Dussehra special | శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఆది ప‌రాశ‌క్తి అమ్మ‌వారిని కొలుస్తుంటారు. ఒక్కో రోజు ఒక్కో అవ‌తారంలో అలంక‌రించి పూజ‌లు చేస్తారు. దేశ‌వ్యాప్తంగా అమ్మ‌వారి అష్టాద‌శ శ‌క్తిపీఠాల‌తో పాటు విభిన్న పేర్ల‌తో, వేర్వేరు రూపాల్లో కొలువైన‌ అమ్మ‌వారి ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఇదంతా అంద‌రికీ తెలిసిందే. మ‌రి వేర్వేరు రూపాల్లో కొలువైన అమ్మ‌వారి పేర్ల‌తోనే కొన్ని న‌గ‌రాలు వెలిశాయి. మ‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై కూడా అమ్మ‌వారి పేరు మీద‌నే వెలిసింది. ముంబై ఒక్క‌టే కాదు.. ఇలా చాలా న‌గ‌రాలు అమ్మ‌వారి పేర్ల‌తో ఏర్ప‌డి ఇప్పుడు ఎంత‌గానో పాపుల‌ర్ అయ్యాయి.. మ‌రి ఆ న‌గ‌రాలేంటో ఒక‌సారి చూద్దామా..

ముంబా దేవి పేరుతో ముంబై

భార‌త ఆర్థిక రాజ‌ధాని అయిన‌ ముంబై మ‌హాన‌గ‌రానికి ఆ పేరెలా వ‌చ్చిందో తెలుసా ! ఆదిప‌రాశ‌క్తి అంశ అయిన ముంబా దేవి పేరు మీద ఈ న‌గ‌రానికి ఆ పేరు వ‌చ్చింది. దీని వెనుక ఓ పురాణ‌గాథ కూడా ఉంది. కాళికా దేవి అవ‌తారం ఎత్తే క్ర‌మంలో ప‌ట్టుద‌ల‌, ఏకాగ్ర‌త అల‌వ‌రుచుకోవ‌డం కోసం ప‌ర‌మ‌శివుడి ఆదేశాల మేర‌కు ఓ మ‌త్స్య‌కారుల కుటుంబంలో పార్వ‌తీదేవి జ‌న్మించింది. మ‌త్య్స‌ పేరుతో జ‌న్మించిన అమ్మ‌వారు.. మ‌త్స్యకారుడి అవ‌తారంలో వ‌చ్చిన ప‌ర‌మేశ్వ‌రుడిని వివాహం చేసుకుని అవ‌తారం చాలించింది. ఆ స‌మ‌యంలో మ‌త్య్స‌కారుల కోరిక మేర‌కు మ‌హా అంబ‌గా వెలిసింది. కాలక్ర‌మేణా ఆమె పేరు ముంబా దేవిగా మారిన‌ట్లు స్థ‌ల పురాణం ద్వారా తెలుస్తోంది. ముంబా దేవిని అక్క‌డి ప్ర‌జ‌లు ముంబా ఆయి ( మరాఠీలో అమ్మ అని అర్థం )గా పిలిచేవారు. ఆ అమ్మ‌వారి పేరు మీద‌నే ఆ న‌గ‌రానికి ముంబై అని పేరొచ్చింది. సౌత్ ముంబైలోని బులేశ్వ‌ర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆల‌యంలోని అమ్మ‌వారు రాతి రూపంలో ద‌ర్శ‌న‌మిస్తారు. ఇక్క‌డ ద‌స‌రా ఉత్స‌వాలు వైభ‌వంగా నిర్వ‌హిస్తారు.

సిమ్లా

- Advertisement -

మంచు దుప్ప‌టి క‌ప్పేసిన‌ట్టుగా ఉండే సిమ్లా న‌గ‌రం పేరు వెనుక కూడా ఇలాంటి క‌థ‌నే ఒక‌టి ఉంది. ఇక్క‌డి స్థ‌ల పురాణం ప్ర‌కారం సాక్షాత్తు కాళీ మాత‌.. శ్యామ‌లా దేవిగా ఈ ప్రాంతంలో వెలిసింది. జ‌కు కొండ‌పై వెల‌సిన అమ్మ‌వారికి 1845లో బెంగాలీ భ‌క్తులు ఒక గుడిని నిర్మించారు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో శ్యామ వ‌ర్ణంలో మెరిసిపోతున్న దుర్గామాత రూపం భ‌క్తుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. దీంతో ఇక్క‌డి దుర్గా మాత‌ను శ్యామ‌లా దేవిగా పిలుస్తున్నారు. ఆమె పేరు మీద‌నే ఆ న‌గ‌రానికి సిమ్లా అనే పేరొచ్చింది.

చండీగ‌ఢ్‌

పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల ఉమ్మ‌డి రాజ‌ధాని చండీగ‌ఢ్‌. స్విస్- ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లి కార్బుసియెర్ డిజైన్ చేసిన ఈ అద్భుత న‌గ‌రానికి చండీగ‌ఢ్ పేరు పెట్ట‌డం వెనుక ఓ కార‌ణం ఉంది. ఈ న‌గ‌రానికి 15 కిలోమీట‌ర్ల దూరంలో పంచ‌కుల జిల్లా క‌ల్క ప‌ట్ట‌ణంలో చండీ దేవి వెలిసింది. ఈ చండీ మందిర్ అక్క‌డ చాలా ఫేమ‌స్‌. దీంతో అక్క‌డి అమ్మ‌వారి పేరు మీద‌నే చండీగ‌ఢ్ అని పేరు పెట్టారు. చండీ అంటే పార్వ‌తీదేవి ఉగ్ర రూప‌మైన చండీ మాత అవ‌తారం. గ‌ఢ్ అంటే కొలువైన స్థ‌లం అని అర్థం.

మంగ‌ళూరు

క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు న‌గ‌రం కూడా అమ్మ‌వారి పేరు మీదే వ‌చ్చింది. ఆ ప్రాంతంలో కొలువైన‌ మంగ‌ళాదేవి పేరు మీదే ఆ న‌గ‌రానికి మంగ‌ళూరు అని పేరొచ్చింది. ఇక్క‌డి మంగ‌ళా దేవి ఆల‌యాన్ని శ్రీ మ‌హా విష్ణువు అవ‌తార‌మైన ప‌ర‌శురాముడు నిర్మించిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇదే ఆల‌యాన్ని 9వ శ‌తాబ్దంలో తులునాడును ప‌రిపాలించిన కుంద‌వ‌ర్మ‌న్ అనే రాజు పున‌ర్మించారు. నేపాల్ నుంచి వ‌చ్చిన సాధువుల‌ సూచ‌న మేర‌కు ఆయ‌న ఈ ఆల‌యాన్ని పున‌ర్మించార‌ని పురాణ క‌థ‌ల ద్వారా తెలుస్తోంది.

కోల్‌క‌తా

ద‌సరా ఉత్స‌వాలు.. దుర్గా దేవి శ‌ర‌న్నవ‌రాత్రులు అంటే ఎక్కువ‌గా గుర్తొచ్చేది ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తానే. న‌వరాత్రుల స‌మ‌యంలో ఇక్క‌డ కాళీ మాత మండ‌పాలు ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. అలాంటి కోల్‌క‌తాకు ఆ పేరు రావ‌డం వెనుక కూడా కార‌ణం ఉందట‌. కోల్‌క‌తా అనేది బెంగాలీ భాష‌లోని కాలిక్ క్షేత్ర అనే ప‌దం నుంచి వ‌చ్చింది. కాలిక్ క్షేత్ర అంటే కాళికా దేవి కొలువైన స్థ‌లం అని అర్థం. అలాగే కాళీ ఘాట్ అనే ప‌దం నుంచి కోల్‌క‌తా అనే పేరొచ్చిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. కోల్‌క‌తాలోని కాళీ ఘాట్ కాళీ దేవి ఆల‌యానికి 200 ఏండ్ల చ‌రిత్ర ఉన్న‌ట్లు స్థ‌ల పురాణం ద్వారా తెలుస్తోంది.

ప‌ట్నా

బిహార్ రాజ‌ధాని ప‌ట్నాకు ఆ పేరు రావ‌డానికి కూడా అమ్మ‌వారే కార‌ణం. ఇక్క‌డ శ‌క్తి స్వ‌రూపిణి అయిన ప‌త‌న్ దేవి అమ్మ‌వారి ఆల‌యం ఉంది. ఇది 51 సిద్ధ శ‌క్తి పీఠాల్లో ఒక‌టి. పురాణాల ప్ర‌కారం.. ద‌క్ష య‌జ్ఞం స‌మ‌యంలో అగ్నికి ఆహుతి అయిన స‌తీ దేవి శ‌రీరాన్ని మ‌హావిష్ణువు ముక్క‌లుగా ఖండించిన స‌మ‌యంలో కుడి తొడ భాగం ఇక్క‌డ పడింది. ఆ ప్రాంతంలో వెల‌సిన అమ్మ‌వారిని స‌ర్వానంద కారి ప‌త‌నేశ్వ‌రి పేరుతో కొలిచేవారు. ఇప్పుడు ప‌త‌న్ దేవిగా పూజిస్తారు. ఈ అమ్మ‌వారి పేరు మీద‌నే ఆ న‌గ‌రానికి ప‌ట్నా అని పేరు పెట్టారు.

నైనిటాల్‌

ఉత్త‌రాఖండ్‌లోని నైనిటాల్ న‌గరానికి ఆ పేరు రావ‌డం వెన‌క కూడా అమ్మ‌వారే ఉన్నారు. ద‌క్ష య‌జ్ఞం స‌మ‌యంలో అగ్నికి ఆహుతి అయిన స‌తీ దేవి శ‌రీరాన్ని మ‌హావిష్ణువు ముక్క‌లుగా ఖండించిన స‌మ‌యంలో అమ్మ‌వారి నేత్రాలు ఈ ప్ర‌దేశంలో ప‌డిన‌ట్లు స్థ‌ల పురాణం చెబుతుంది. మ‌హిషాసురుడిని సంహ‌రించిన సంహ‌రించిన స‌మ‌యంలో అమ్మ‌వారిని దేవ‌త‌లంద‌రూ జై నైనా అంటూ నిన‌దించారంట‌. అప్ప‌టి నుంచి ఇక్క‌డి అమ్మ‌వారు నైనా దేవిగా పూజ‌లు అందుకుంటుంద‌ని చెబుతుంటారు.

దుర్గా మాత పేరుతో మ‌రికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

నగరం పేరుఅమ్మవారి పేరు
త్రిపుర త్రిపుర సుంద‌రి
మైసూర్ (క‌ర్ణాట‌క‌)మ‌హిషాసుర మ‌ర్దిని
అంబ జోగె( మ‌హారాష్ట్ర‌)అంబ జోగేశ్వ‌రి
క‌న్యాకుమారి ( త‌మిళ‌నాడు )క‌న్యాకుమారి దేవి
తుల్జాపూర్ ( మ‌హారాష్ట్ర )తుల్జా భ‌వానీ
అంబాలా (హ‌ర్యానా )భ‌వానీ అంబా దేవి
సంబ‌ల్‌పుర్ ( ఒడిశా )స‌మ‌లై దేవి
Dussehra special


లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

dussehra | ద‌స‌రా రోజు పాలపిట్ట‌ను ఎందుకు చూడాలి?

Dussehra | ద‌స‌రా రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?

దసరా న‌వ‌రాత్రుల్లో అమ్మ‌వారిని రోజుకో వ‌స్త్రంలో ఎందుకు ద‌ర్శించుకోవాలి?

Bathukamma songs | ఈ బతుకమ్మ పాటలు మీరు విన్నారా?

పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?

Dussehra | చెడుపై రణం మంచి తరుణం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement