పెళ్లి పేరుతో యువతిపై ఎమ్మెల్యే కొడుకు లైంగికదాడి
యువతి | మధ్యప్రదేశ్‌లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్నాడు ఎమ్మెల్యే సుపుత్రుడు. బాధిత యువతి ఫిర్యాదుతో ఇండోర్ పోలీసులు అతనిపై కేసు

ఇండోర్: మధ్యప్రదేశ్‌లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్నాడు ఎమ్మెల్యే సుపుత్రుడు. బాధిత యువతి ఫిర్యాదుతో ఇండోర్ పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు. ఉజ్జయిని జిల్లా బంద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ మొర్వాలి కుమారుడు కరన్ మొర్వాలి. అతను జిల్లా కాంగ్రెస్ యూత్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు కూడా అదే యువజన కాంగ్రెస్ నాయకురాలు కావడం విశేషం.
గత ఏడాది డిసెంబర్ తాము కలిశామని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఇండోర్ పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. నగరంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడి పాల్పడ్డాడని వెల్లడించింది. దీంతో ఎమ్మెల్యే మురళి, అతని కుమారుడు కరన్‌పై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి జ్యోతి శర్మ వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
కొవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

