e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News వాహనాల బ్యాటరీలను చోరీ చేసే దొంగ అరెస్ట్

వాహనాల బ్యాటరీలను చోరీ చేసే దొంగ అరెస్ట్

వాహనాల బ్యాటరీలను చోరీ చేసే దొంగ అరెస్ట్

వరంగల్‌ అర్బన్‌ : జల్సాలకు అలవాటు పడి వాహనాల బ్యాటరీలను చోరీ చేస్తున్న దొంగను వరంగల్‌ పోలీసులు వలపన్ని పట్టకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని హన్మకొండ ప్రాంతానికి చెందిన పస్తం ఐలు కుమార్‌ (30) పొద్దంతా ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ రాత్రి కాగానే దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

పార్కింగ్‌ చేసిన లారీలు, డీసీఎంలు, టాటాఎస్‌లు, ఆటోల బ్యాటరీలను చోరీ చేసి అమ్మిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, వరంగల్‌లోని ఆటో నగర్ సమీపంలో బ్యాటరీలను విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

దొంగ సొత్తు స్వాధీనo చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను వరంగల్‌ సీపీ ప్రమోద్‌ కుమార్‌ అభినందించారు.

వాహనాల బ్యాటరీలను చోరీ చేసే దొంగ అరెస్ట్

ఇవి కూడా చదవండి..

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ : మంత్రి పువ్వాడ

శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి

బీన్స్‌తో డ‌యాబెటిస్‌కు చెక్‌..!

కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత

రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు

పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచండిలా..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాహనాల బ్యాటరీలను చోరీ చేసే దొంగ అరెస్ట్

ట్రెండింగ్‌

Advertisement