Parcel Bomb | ఇద్దరి మరణానికి కారణమైన పార్శిల్ బాంబు వెనుక.. ఒక తప్పుడు వ్యవహారం
Parcel Bomb | ఇద్దరి మరణానికి కారణమైన పార్శిల్ బాంబు (Parcel Bomb) వెనుక ఒక తప్పుడు వ్యవహారం ఉందని పోలీసులు తేల్చారు. మృతుడి భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి టేప్ రికార్డర్‌ను పోలిన పార్శిల్ బాంబును ఆ ఇంటికి పంపాడని వెల్లడించారు.
అహ్మదాబాద్: ఇద్దరి మరణానికి కారణమైన పార్శిల్ బాంబు (Parcel Bomb) వెనుక ఒక తప్పుడు వ్యవహారం ఉందని పోలీసులు తేల్చారు. మృతుడి భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి టేప్ రికార్డర్‌ను పోలిన పార్శిల్ బాంబును ఆ ఇంటికి పంపాడని వెల్లడించారు. గుజరాత్‌లోని వడాలిలో గురువారం మధ్యాహ్నం ఒక ఇంట్లో పార్శిల్ బాంబు పేలింది. కూలీ అయిన 32 ఏళ్ల జీతూభాయ్ హీరాభాయ్ వంజర, అతడి కుమార్తె అయిన 12 ఏళ్ల భూమిక ఈ సంఘటనలో మరణించారు. 9, 10 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.
కాగా, స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఒక ఆటో డ్రైవర్ ఆ పార్శిల్‌ను ఆ ఇంటికి డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడైన 31 ఏళ్ల జయంతిభాయ్ బాలుసింగ్ వంజరను అరెస్ట్ చేశారు. పోలీసులు అతడ్ని ప్రశ్నించగా తన మాజీ ప్రియురాలిని జీతూభాయ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో అతడ్ని చంపేందుకు కుట్ర పన్నినట్లు తెలిపాడు. టేప్ రికార్డ్‌ను పోలిన పార్సిల్ బాంబును జీతూభాయ్ ఇంటికి పంపినట్లు చెప్పాడు.
మరోవైపు ఈ పార్శిల్ బాంబును తయారు చేసేందుకు జయంతిభాయ్ రాజస్థాన్‌కు వెళ్లాడని పోలీసులు తెలిపారు. జిలాటిన్ స్టిక్స్, డిటోనేటర్‌ను ఉపయోగించినట్లు చెప్పారు. పార్శిల్‌ను తెరిచిన జీతూభాయ్, అతడి కుమార్తెలు టేప్ రికార్డర్ ప్లగ్‌ను కరెంట్ సాకెట్లో పెట్టి స్విచ్ వేయడంతో అది పేలిందని వెల్లడించారు. ఆ సమయంలో జీతూభాయ్ భార్య ఇంట్లో లేదని పోలీసులు తెలిపారు. పార్శిల్ బాంబు కుట్రలో ఆమె ప్రమేయంతోపాటు ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

