పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!
నిరోధక శక్తి | ద్దల కన్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వారు నిత్యం దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్రత తక్కువగా పాటిస్తారు.

పెద్దల కన్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వారు నిత్యం దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్రత తక్కువగా పాటిస్తారు. స్కూల్లోనూ ఇతర పిల్లలతో కలసి తిరుగుతారు కనుక వారికి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వారిలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచాలి. దీంతో ఇన్ఫెక్షన్లు నుంచి కూడా తప్పించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం
పిల్లలకు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ సమతూకంలో ఉండే ఆహారం ఇవ్వాలి. దీంతో వారిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే నిత్యం నిమ్మ జాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకు పచ్చని కూరగాయలు, బీన్స్, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపించాలి. దీని వల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
నిద్ర
పిల్లలన్నాక నిద్రపోకుండా మారాం చేయడం సహజమే. కొందరు పిల్లలయితే అర్ధరాత్రి వరకు గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను త్వరగా పడుకోబెట్టాలి. నిద్ర సరిగ్గా పోకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో పిల్లకు తల్లిదండ్రులు చెప్పాలి. వారిని కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉంచాలి. నిద్ర తగినంతగా ఉంటే పిల్లల్లో శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
శుభ్రత
ఆహారం తినేముందు, తిన్నాక చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఆ అలవాటు చేయించాలి. ఆటలు ఆడుకున్నాక, కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులను ముట్టుకున్నాక చేతులను శుభ్రంగా కడుక్కోమని చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం దుమ్ము, ధూళిలో గడపడం వల్ల, పెంపుడు జంతువులను ముట్టుకోవడం వల్లే వస్తాయి. కనుక ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
ఆయుర్వేదం
పిల్లలకు గుడుచి, అమలాకి (ఉసిరి), యష్టిమధు, గుగ్గుళ్లు తదితర ఆయుర్వేద మూలికలను నిత్యం ఇవ్వాలి. డాక్టర్ల సూచన మేరకు వీటిని పిల్లలకు ఇస్తుంటే పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

