Loksabha Elections 2024 : యూపీలోని రాయ్‌బరేలి, అమేథి నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించిన అనంతరం పార్టీ నిర్ణయాన్ని సీనియర్ నేత జైరాం రమేష్ సమర్ధించారు. రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపడం బీజేపీ ఆ పార్టీ మద్దతుదారులకు షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించారు.
రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే వార్తలపై ఎంతో మందికి ఎన్నో అభిప్రాయాలున్నాయని, రాజకీయాల్లో, చెస్‌లో ఆయన ఎంతో అనుభవమున్న ఆటగాడని మరవరాదని జైరాం రమేష్ అన్నారు. విస్తృత చర్చ అనంతరం భారీ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగా పార్టీ నాయకత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఈ నిర్ణయం బీజేపీ సహా దాని మద్దతుదారులను వణికిస్తోందని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ అపర చాణుక్యుడిగా చెప్పుకునే బీజేపీ నేతకు ఇప్పుడెలా స్పందించాలో తెలియడం లేదని అన్నారు. రాయ్‌బరేలి చాలాకాలంగా ఇందిరా గాంధీ, సోనియా గాంధీల స్ధానం మాత్రమే కాదని, ఇది వారసత్వం కాదని, ఇది బాధ్యత అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబానికి అమేథి-రాయ్‌బరేలి మాత్రమే కాదని, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ దేశమంతా కాంగ్రెస్‌కు పట్టుందని పేర్కొన్నారు.
Read More :
Sunrisers Hyderabad | సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దగ్గరుండి గెలిపించిన అనసూయ.. వీడియో