శుక్రవారం 05 మార్చి 2021
Crime - Feb 23, 2021 , 18:49:02

మైన‌ర్‌పై అత్యాచారం కేసులో వ్య‌క్తికి ప‌దేళ్ల జైలు, జ‌రిమానా

మైన‌ర్‌పై అత్యాచారం కేసులో వ్య‌క్తికి ప‌దేళ్ల జైలు, జ‌రిమానా

సిద్దిపేట‌ : బాలిక‌(10)ను కిడ్నాప్ చేసి మాన‌భంగం చేసిన కేసులో దోషిగా తేలిన వ్య‌క్తికి న్యాయ‌స్థానం ప‌దేళ్ల క‌ఠిన కారాగార‌శిక్ష అదేవిధంగా రూ. వెయ్యి జ‌రిమానా విధించింది. హుస్నాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో న‌మోదైన ఈ కేసు వివ‌రాలిలా ఉన్నాయి. పొట్ల‌ప‌ల్లి గ్రామంలో 17 సెప్టెంబ‌రు 2016న బాలిక ఇంటివ‌ద్ద ఉండ‌గా చొప్ప‌రి కుమార్‌(25) అనే యువ‌కుడు మాయ‌మాట‌లు చెప్పి త‌న వెంట తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధిత త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు అప్ప‌టి ఎస్ఐ సంజ‌య్ కేసు న‌మోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ద‌ర్యాప్తు అనంత‌రం కోర్టులో ఛార్జిషీటు దాఖ‌లు చేశారు. 

నాలుగవ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్, పోక్సో కోర్టు కరీంనగర్‌లో కేసు విచారణ జరిగింది. ప‌లు విచార‌ణ‌ల అనంత‌రం న్యాయ‌మూర్తి డి.మాధవి కృష్ణ ఇరువైపులా వాద‌న‌లు విన్నారు. నిందితుడిపై నేరం రుజువు కావ‌డంతో దోషిగా తేల్చుతూ న్యాయ‌మూర్తి శిక్ష‌ను ఖ‌రారు చేశారు. స‌మ‌ర్థ‌వంత‌మైన వాద‌న‌లు వినిపించిన క‌రీంన‌గ‌ర్‌ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ వి. శ్రీ‌నివాస్‌, కానిస్టేబుళ్లు, ర‌వీంద‌ర్‌, కిష్ట‌య్య‌, సిద్దిపేట కోర్టు లైజ‌నింగ్ అధికారి స్వామిదాస్‌ల‌కు ఉన్న‌తాధికారులు అభినందన‌లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ.. తప్పు చేసిన‌ ఎవ్వరూ కూడా చట్టం నుండి తప్పించుకోలేరన్నారు. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్షలు పడతాయన్నారు. కేసు విచార‌ణ‌ చేసిన అధికారులను, కోర్టు కానిస్టేబుళ్ల‌ను పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ అభినందించారు. 

VIDEOS

logo