కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ! | కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. దేశంలో

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని కేంద్ర సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. ‘సహకార్ సే సమృద్ధి’ (సహకారంతో సమృద్ధి) విజన్‌ను సాధించేందుకు ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త శాఖకు సంబంధించి కొత్త మంత్రిని బుధవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో నియమించే అవకాశం ఉన్నది.
ప్రజా ఉద్యమం క్షేత్రస్థాయికి చేరుకునేందుకు నూతన మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుందని, బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్న ఈ దేశానికి.. సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి విధానం సరిగ్గా సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. సహకార సంస్థల సులభతర వాణిజ్యం కోసం ఈ మంత్రిత్వ శాఖ పని చేయడంతో పాటు బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధిని సాకారం చేసేందుకు ఈ శాఖ పాటుపడుతుందని వివరించారు. సమాజ ఆధారిత అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుందని.. కొత్త మంత్రిత్వ శాఖ ఆ దిశగా ముందడుగుగా సంబంధిత అధికారులు అభివర్ణించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన వాస్తవరూపు దాల్చినట్లు అవుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం
ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా.. ఇదిగో పరిష్కారం
తెలంగాణలో మూడు రోజులు వానలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

