ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం

యోగాసనాల్లో సులువైనది, ఆరోగ్యాన్ని ప్రసాదించేది కటి చక్రాసనం. చేతుల కదలికలపై ఆధారపడి ఉండే ఈ ఆసనాన్ని సాధన చేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు. వీపు, వెన్ను, నడుము భాగాలపై ఒత్తిడిని దూరం చేసే కటి చక్రాసనం ఎలా వేయాలంటే..
- ముందుగా చేతులను వదులుగా విడిచి, నిటారుగా నిల్చోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎడమ అరచేతిని కుడి భుజంపై ఉంచాలి.
- ఇప్పుడు శ్వాస వదులుతూ కుడిచేతిని వీపుపైకి తీసుకెళ్లి అరచేతిని నడుముపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ అరచేతిని మెడ వెనుక భాగాన్ని పుష్ చేస్తూ నిదానంగా కుడివైపునకు మెడను తిప్పి చూడాలి. ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఈ సమయంలో శ్వాసక్రియ నిదానంగా సాగేలా చూసుకోవాలి. మళ్లీ యథాస్థితికి చేరుకోవాలి.
- ఇప్పుడు కుడి అరచేతిని భుజంపై ఉంచి, ఎడమ చేతిని వీపుపైకి తీసుకెళ్లి అరచేతిని నడుముపై ఉంచాలి. కుడి అరచేతితో మెడను పుష్ చేస్తూ, మెడను ఎడమ
- వైపునకు తిప్పాలి. ఈ స్థితిలో 20 సెకండ్లు ఉన్న తర్వాత, యథాస్థితికి రావాలి.
- ఈ ఆసనం వేయడం వల్ల ఛాతీ వైశాల్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మెడ, భుజాలు, నడుము, తుంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం దూరమవుతుంది. నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే, ఈ ఆసనాన్ని వేయాలి.
- కండ్లు తిరుగుతున్నా, వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్నట్టు అనిపించినా ఈ ఆసనం ప్రయత్నించొద్దు.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- anitha
- kati chakrasanam
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

