ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఫుల్ డిమాండ్.. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో మోస్తరు..
ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఫుల్ డిమాండ్.. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో మోస్తరు..| ఏప్రిల్ తో పోలిస్తే మేలో దేశీయంగా ఉద్యోగాల నియామకాల్లో మోస్తరుగా పురోగతి...

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో దేశీయంగా ఉద్యోగాల నియామకాల్లో మోస్తరుగా పురోగతి నమోదైంది. ఏప్రిల్‌లో 10 శాతంగా ఉన్న నియామకాలు మే నాటికి 35 శాతానికి పెరిగాయని సోషల్ మీడియా వేదిక లింక్డ్ ఇన్ తెలిపింది. అయితే, కరోనా రెండో వేవ్ ఉధ్రుతి తర్వాత ఆర్థిక రంగం దెబ్బ తినడంతో నియామకాల్లో అనిశ్చితి నెలకొంది.
కరోనా రెండో వేవ్ ప్రభావం చూపకముందు మార్చి నెలలో 50 శాతం నియామకాలు జరిగాయి. కానీ కరోనా కేసులు క్రమంగా పెరగడంతో ఏప్రిల్ నెలలో నియామకాలు 10 శాతానికి పడిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాల వారీగా లాక్డౌన్లు, ఆంక్షలు సడలించడంతో మే నెలలో పురోగతి నమోదైంది.
గతేడాది కరోనా నేపథ్యంలో మాదిరిగానే స్పైషలైజ్డ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ విభాగాల్లో నియామకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
తదుపరి అప్లికేషన్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్, ఎస్ఏపీ స్పెషలిస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉందని లింక్డ్ ఇన్ తెలిపింది. ఇద్దరు ఉద్యోగార్థుల్లో ఒకరు లొకేషన్ ప్రియారిటీ, పని గంటలు, వర్క్ లైఫ్, తదితర అంశాల్లో ఫ్లెక్సిబిలిటీని డిమాండ్ చేస్తున్నారు.
వర్కింగ్ ఉమెన్, యువ నిపుణుల నియామకాలు ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఉన్నాయి. పురుషుల కంటే శ్రామిక మహిళల్లో నాలుగు రెట్లు విశ్వాసం తక్కువగా ఉంది. నూతన గ్రాడ్యుయేట్లు ఉద్యోగం పొందడానికి రెండు నుంచి మూడు నెలల టైం పడుతుందని లింక్డ్ ఇన్ తెలిపింది.
ఫైనాన్స్, కార్పొరేట్ సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్ కేర్, హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ రంగాల్లో నియామకాలు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి భిన్నంగా కన్జూమర్ గూడ్స్, మీడియా & కమ్యూనికేషన్స్, ఆటోమోటివ్, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్, స్టాఫింగ్ &రిక్రూటింగ్ రంగాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి.
పది కంపెనీల్లో తొమ్మిది వివిధ విభాగాలను విలీనం చేసేస్తున్నాయి. అంతర్గతంగా నియామకాలు పూర్తి చేసేస్తున్నాయి. ప్రొడక్ట్ మేనేజ్మెంట్, కన్సల్టింగ్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో నియామకాలు ఇంటర్నల్‌గా సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్‌లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- jobs market
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

