Crime
- Dec 21, 2020 , 18:43:16
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సిద్దిపేట : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన సిద్దిపేట టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన వర్కోలు రాజు (46) బీరువా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. సొంత పనిపై హోండా యాక్టివాపై హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రంగధాంపల్లి వైపు వెళ్లాడు. ఈ క్రమంలో బీజేఆర్ చౌరస్తాకు రాగానే ప్రమాదం జరిగింది.
చికిత్స నిమిత్తం అతన్ని వెంటనే సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు మృతి చెందినట్లు నిర్దారించారు. రాజు బైక్‌ను కారు ఢీకొట్టడం వల్లనే మృతి చెందాడని బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
MOST READ
TRENDING