హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో పుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్న శివ అనే వ్యక్తిని తోటి కూలీ హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిన్న రాత్రి శివ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడని, మద్యం మత్తులో డేవిడ్ అనే వ్యక్తి అతన్ని హత్య చేశాడని వెల్లడించారు. రాత్రి 2 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు తెలిపారు. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..