గిరిపుత్రుల అక్షరానికి వారధిగా ప్రభుత్వం.. త్వరలో డిక్షనరీలు
ప్రభుత్వం| గిరిపుత్రుల అక్షరానికి ప్రభుత్వం వారధి కడుతున్నది. గిరిజన భాష, సంస్కృతుల పరిరక్షణ, అక్షరాస్యత పెంపునకు మాతృభాషలో బోధన కోసం గోండి, లంబాడా భాషల్లో డిక్షనరీలు రూపొందిస్తున్నది.

హైదరాబాద్: గిరిపుత్రుల అక్షరానికి ప్రభుత్వం వారధి కడుతున్నది. గిరిజన భాష, సంస్కృతుల పరిరక్షణ, అక్షరాస్యత పెంపునకు మాతృభాషలో బోధన కోసం గోండి, లంబాడా భాషల్లో డిక్షనరీలు రూపొందిస్తున్నది. గోండి భాషా డిక్షనరీ రూపకల్పనలో రాష్ట్ర భాషా నిపుణులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భాషాకోవిదులు పాలుపంచుకుంటున్నారని, దాదాపు పూర్తి కావొచ్చిందని టీసీఆర్టీఐ జాయింట్ డైరెక్టర్ వీ సముజ్వల తెలిపారు. లంబాడా డిక్షనరీని సైతం రూపొందిస్తున్నట్టు వివరించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గిరిజన జనాభా 31,77,940. రాష్ట్రంలో 32 గిరిజన తెగలున్నాయి. వీటిలో కోయ, గోండు, పర్ధాన్, తోటి, కోలామ్, చెంచు, ఎరుకల, కొండరెడ్డి, ఆంధ్ తెగల జనాభా ఎక్కువ. ఇందులో లిపి ఉన్న తెగ గోండి (జనాభా 2,97,846), కోలామ్ (44,805), కోయ (3,81,354), లంబాడా(2,44,039). ఈ నాలుగు తెగలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని విద్యార్థుల కోసం గిరిజన సాంస్కృతిక, పరిశోధన, శిక్షణా సంస్థ ఆయా భాషల్లో వాచకాలను రూపొందించింది. ఆదివాసీ, గిరిజన తెగల సంస్కృతిని భవిష్యత్తరాలకు అందించేందుకు వీడియోగ్రఫీ చేస్తున్నట్టు గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ (టీసీఆర్టీఐ) డైరెక్టర్ వీ సర్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. పుట్టుక నుంచి చావు వరకు మనిషితో సంబంధం ఉన్న అన్ని అంశాలను క్రోడీకరించి గ్రంథస్తం చేస్తున్నామని టీసీఆర్టీఐ జాయింట్ డైరెక్టర్ వీ సముజ్వల పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సంప్రదాయ ఆహారానికే జై!
పెన్షన్ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ పెంపునకు కేంద్రం యోచన
ఓటర్లకు జిలేబీ, సమోసాలు!
తదుపరి సీఈసీగా సుశీల్ చంద్ర!
పంజాబ్ వ్యాక్సినేషన్ ప్రచారకర్తగా సోనూసూద్
మహారాష్ట్రలో 3 వారాల లాక్డౌన్? నేడు నిర్ణయం
పసి మనసులతో విష రాజకీయం
తల్లిదండ్రులూ.. బహుపరాక్!
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

