షాద్‌నగర్, సెప్టెంబర్ 28 : కొందరు వ్యక్తులు కృష్ణ జింకను వేటాడి దాని మాంసాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. షాద్‌నగర్ డీసీపీ శిరీష సోమవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని ఈది బజార్‌కు చెందిన ఎండీ హజీవుద్దీన్ స్పోర్ట్స్మెన్గా ఉన్న సమయంలో అదే కోటాలో తుపాకీ వినియోగానికి అనుమతులు పొందాడు. ఆ తరువాత అతను రియల్ ఎస్టేట్ వ్యా పారిగా మారాడు.
హజీవుద్దీన్ తన స్నేహితులైన హైదరాబాద్‌కు చెందిన మీర్ ముక్తార్ అలీ, ఎండీ తాజ్మోల్, సయ్యద్ సల్మాన్అలీ, ఎండీ అబ్దుల్ అజీజ్, సంగారెడ్డికి చెందిన ఖుర్రం ఖాన్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన ఎండీ అఫ్రోజ్‌ఖాన్, నారాయణపేట జిల్లా ఉట్కూర్ వాసి ఎండీ రియాజ్‌తో కలిసి ఈ నెల 26న నారాయపేట జిల్లా మరికల్ ప్రాంతంలో ఎండీ హాజీవుద్దీన్ తుపాకీతో కృష్ణ జింకలను వేటాడారు. ఇందులో ఓ జింక మృతి చెం దింది. పక్కా సమాచారం తెలుసుకున్న ఎస్వోటీ, స్థానిక పోలీసులు ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వ ద్ద వాహనాలను తనిఖీ చేసి వీరిని పట్టుకున్నారు. నిందితుల నుంచి తుపాకీ, 19 బుల్లెట్లు స్వాధీనం చేసికుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ శిరీష తెలిపారు.