గురువారం 02 జూలై 2020
Crime - Jun 01, 2020 , 21:15:06

ఐఫోన్‌ కస్టమర్స్‌కు టోకరా!

ఐఫోన్‌ కస్టమర్స్‌కు టోకరా!

హైదరాబాద్‌: కొత్త ఫోన్లను కొనుగోలు చేసేందుకు ప్రీ-బుకింగ్‌ చేసుకొన్న వారిని కూడా సైబర్‌ నేరగాళ్లు వదలట్లేదు. కొత్త మోడళ్లు కొనుగోలు చేసేందుకు ఎవరెవరు ప్రీ-బుకింగ్‌లు చేస్తున్నారో గుర్తించి వారికి ఫోన్‌ చేసి మరీ మోసగిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని అపట్రాన్సిక్‌ సంస్థ డైరెక్టర్‌ మేఘాసింగ్‌.. ఐఫోన్‌ వినియోగదారులను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో కొత్తగా వచ్చే ఐఫోన్‌న్లను 10 శాతం చెల్లించి అడ్వాన్స్‌ బుక్‌ చేసుకొంటారు. ఈ క్రమంలో ఫోన్‌ కోసం బుకింగ్‌ చేసుకొన్న ఒకరికి.. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. ఫోన్లు వచ్చేశాయని, మిగతా డబ్బు గూగులో పే ద్వారా ఫలానా నంబర్‌కు పంపించాలంటూ సూచించాడు. దాంతో అనుమానం వచ్చిన ఐఫోన్‌ వినియోగదారుడు సంస్థకు ఫోన్‌ చేసి ఆరా తీయడంతో.. ఎవరో మోసం చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అనంతరం సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. 


logo