శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 13:44:55

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

వరంగల్ రూరల్:  జిల్లాలో విశాదం చోటు చేసుకుంది.  కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన నెక్కొండ మండల కేంద్రంలో  జరగటంతో స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు.. చొప్పరి అశోక్, అక్షర భార్యభర్తలు. వీరికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది.  భార్య భర్త ఇద్దరూ ఓ కిరాణ దుకాణంలో పని చేస్తారు. వీరికి పిల్లలు లేరు. వీరి కాపురంలో తరచుగా గొడవలు జరిగేవని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం అశోక్ అక్షర తలపై రోకలి బండతో  కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అక్షర (25) ను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.logo