శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 20:24:34

యూపీలో మరో దారుణం.. 14 ఏండ్ల బాలికపై హత్యాచారం

యూపీలో మరో దారుణం.. 14 ఏండ్ల బాలికపై హత్యాచారం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 14 ఏండ్ల దళిత బాలికపై లైంగికదాడి అనంతరం ఇటుకలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. భడోహిలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలంలోకి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరుడు వెతకగా దారుణంగా హత్యకుగురై ఉన్నది. ఆ బాలికపై లైంగికదాడి చేసి ఇటుకలలో కొట్టి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాగా హత్రాస్‌‌లోని దళిత యువతి ఘటనపై ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ మరో దళిత బాలికపై హత్యాచారం ఘటన వెలుగుచూడటం కలకలం రేపింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo