వనపర్తి, మే 3(నమస్తే తెలంగాణ): కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు ప్రచారం వస్తున్నదని.. ఇది అత్యంత దుర్మార్గమైన పని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాల వ్యవస్థను నాశనం చేయాలని చూడటం ఘోరమైన అంశమన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం విలేకరులతో సమావేశమై మాట్లాడారు. ప్రజల అభీష్టం మేరకే నాటి సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని.. వీటి వల్ల చాలా ప్రాం తాలు అభివృద్ధి చెందాయన్నారు. కార్మిక, కర్షక, వ్యా పార రంగాల్లోని పలు విభాగాల వారీగా చూస్తే.. కొత్త జిల్లాల వ్యవస్థ బలంగా పునాది వేసిందన్నారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ మాత్ర మే కాకుండా అనుబంధంగా మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు వంటివి ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. గతంలో పంజాబ్, హర్యాన కలిసి ఉండగా, కాంగ్రెస్ పార్టీనే రెండు రాష్ర్టాలుగా ఏర్పాటు చేసిందని.. ప్రస్తుతం ఆ రెండు రాష్ర్టాల జనాభా దాదాపు 5కోట్లకు పైగా ఉందన్నా రు. కాగా అక్కడ 46జిల్లాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఆ రెండు రాష్ర్టాలతో పోల్చితే నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు తక్కువేనని ఉదహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యంతోపాటు కొత్త ఆర్థిక వనరులు సమకూరాయన్నారు.
ఈ వ్యవస్థను సర్కారు కదిలించే ప్రయత్నం చేస్తే.. ప్రజల చేతిలో భస్మం కాక తప్పదని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సైతం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను సీఎం రేవం త్ దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ వాయిదా వేస్తున్నారని.. ఐదు నెలలుగా రైతులను, మ హిళలు, నిరుద్యోగులు, యువకులను మోసం చేసిన ఘ నత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన హస్తం పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అ త్యంత ప్రతిభావంతుడైన ప్రవీణ్‌కుమార్‌ను ఓటర్లు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పోడు, కౌలు రైతులకు నాటి సీఎం కేసీఆర్ 4.50 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చారని.. వారికి ఇప్పటి వరకు రైతుబంధు ఎందుకు ఇవ్వలేదో సర్కారు సమాధానం చెప్పాలన్నారు. కొత్త జిల్లాల వ్యవస్థను తొలగిస్తామని వస్తున్న వార్తలపై మంత్రి జూపల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కొత్త జిల్లాల తొలగింపునకు కమిటీ వేస్తున్నారని కొంతకాలంగా వస్తున్న ప్రచారానికి ప్రభుత్వ బాధ్యులు ఎందుకు ఖండించడం లేదన్నారు. మౌనంగా ఉం డడం చూస్తుంటే సర్కారు కొత్త జిల్లాలను ఎత్తివేసే ఎత్తుగడలో ఉన్నట్లుగానే ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు. నాడు చిన్నారెడ్డి సైతం జిల్లాల ఏర్పాటు కోసం ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. ఈ విషయంపై రాష్ట్ర పదవిలో ఉన్న చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి జవాబివ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పెద్దమందడి జె డ్పీటీసీ రఘుపతిరెడ్డి, నాయకులు లక్ష్మారె డ్డి, మన్యంరెడ్డి, నందిమళ్ల అశోక్ ఉన్నారు.