నాగర్‌కర్నూల్, మే 3: రాష్ట్రంలోని 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. నాగర్‌కర్నూల్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం పదింటిని.. 33 జిల్లాలుగా పునర్విభజన చేస్తే, కాంగ్రెస్ ప్రభు త్వం వీటిని 17 జిల్లాలకు కుదించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. జిల్లాల సంఖ్యను కుదిస్తే సవ్యంగా సా గుతున్న పాలన ఆగిపోగా కొత్త సమస్యలు తలెత్తుతాయన్నారు. నాలుగు జిల్లాలుగా ఉన్న ఉమ్మడి పాలమూరును రెండింటికే పరిమితం చేసే అవకాశం ఉన్నదన్నారు. ఇదే జరిగితే జోగుళాంబ గద్వాలను మహబూబ్‌నగర్ జిల్లాలో.. వనపర్తిని నాగర్‌కర్నూల్ జిల్లాలో కలుపుతారన్నారు. జిల్లాల మా ర్పునకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ప్రాంతీయేతరుడైన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి రెండుసార్లు ఎంపీగా గెలిచి ఈప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సోదరుడిని గెలిపించుకోవాలనే లక్ష్యం తో ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా పంచే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. మల్లు రవిని గెలిపిస్తే ఢిల్లీకి మేలు జరుగుతుంది తప్పా.. ఈ ప్రాంతానికి లాభం లేదన్నారు. ఈ ప్రాంతంలో నే పుట్టి పెరిగిన తాను, గురుకులాల కార్యదర్శిగా నిరంతరం కృషి చేసి వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దానన్నారు. బీజేపీ మతాల మ ధ్య చిచ్చు పెడుతున్నదని, ఇంటింటికీ అయోధ్య అ క్షింతలు పంపుతూ హిందూ ధర్మాన్ని తామే రక్షిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారన్నారు. కేంద్రంలో 400 ఎంపీ స్ధానాలతో బీజేపీ అధికారంలో వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను తొలగిస్తుందన్నారు.
ఎంతో మంది అమ్మాయిలపై లైంగిక దాడి చేసిన కర్ణాటక సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఎన్నికల్లో మద్దతిచ్చి స్వయంగా మోదీనే ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. రేవణ్ణ దేశం విడిచి పోవడానికి పరోక్షంగా కేంద్ర హోంమంత్రే కారణమని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు పసిగట్టకపోవడం విచారకరమన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే మహిళలకు కరువైందని.. మణిపూర్‌లో ఆదివాసీ మహిళలను న గ్నంగా ఊరేగించారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. రైతుబంధు రూ.12 వేల హామీ అటకెక్కిందని, వరికి రూ.500 బోనస్ ఊసే లేదన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల తరఫున పోస్టుకార్డు ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినహామీ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 46ను సవరించాలన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే 53 శా తం పోస్టులు కేటాయించడం దారుణమని, అన్ని జిల్లాలకు రిజర్వేషన్ల ప్రకారం సమాన న్యాయం జరిగేలా సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి.. గత ప్రభు త్వం వేసిన డీఎస్సీకి అదనంగా పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. టెట్, డీఎస్సీకి ఫీజు లు లేకుండా దరఖాస్తులు తీసుకుంటామన్న హామీ నెరవేరలేదన్నారు. తక్షణమే జీవో 46ను సవరించి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.