అమ్రాబాద్, మే 3 : ఉమ్మడి పాలమూ రు అభివృద్ధి కోసం పార్లమెంట్లో గళ మె త్తుతానని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం అమ్రాబాద్‌లో బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. కోట్లాది ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను కొట్లా డి తీసుకొచ్చిన కేసీఆర్.. రాష్ర్టా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. రైతును రాజుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కు తుందన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయ ని విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీలతో రాజుగా బతికిన రైతులు.. నేడు రోడ్ల మీదుకు వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తె లంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారని విమర్శించారు.
మతం, దేవుళ్ల పేరుతో బీజేపీ ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్నదన్నారు. ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉమ్మడి పాలమూరు అభివృద్ధి కోసం పార్లమెంట్లో పోరాడుతానన్నారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల మా ట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మో సం చేస్తున్నదన్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చా రు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టమొచ్చినా తోడుగా ఉంటు న్నానన్నారు. ఈ ప్రాం తంలో చదువుకున్న వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అందరం కలిసి గెలిపించుకోవాలని సూచించారు. సమావేశంలో అచ్చంపేట ఎన్నికల ఇన్చార్జి నవీన్‌కుమార్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ అభిలాష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నా యకులు చెన్నకేశవులు, రాంబాబు, వెంకటేశ్, రాంచందర్, శంకర్, మల్లేశ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.