బ్రకోలి: ఒకటి (చిన్నది), పనీర్ తురుము: ఒక కప్పు, ఆలుగడ్డలు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, జీలకర్ర: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: ఒక కప్పు, మైదా: అర కప్పు, బ్రెడ్ క్రంబ్స్: ఒక కప్పు, కొత్తిమీర తురుము: కొద్దిగా.
బ్రకోలిని బాగా కడిగి వీలైనంత చిన్నగా తురమాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అల్లం పచ్చివాసన పోయాక తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంగువ వేయాలి. బాగా వేగాక బ్రకోలి తురుము, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఆలుగడ్డ ముద్ద, పనీర్ తురుము, కొత్తిమీర వేసి
కలపాలి. అంతా బాగా కలిశాక దింపి చల్లార్చుకోవాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేత్తో టిక్కాల్లా ఒత్తుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. ఒక గిన్నెలో మైదా, కొద్దిగా ఉప్పు వేసి నీళ్లుపోసి కాస్త జారుగా కలపాలి. చేసిపెట్టుకున్న టిక్కాలను మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్‌క్రంబ్స్‌లో అద్ది వేడి నూనెలో ఓ మోస్తరుగా ఫ్రై చేసుకుంటే బ్రకోలి పనీర్ కట్లెట్లు సిద్ధం.
Butter Garlic Broccoli Recipe | బటర్ గార్లిక్ బ్రకోలి తయారీ విధానం”
“Broccoli Cheese Sticks Recipe | బ్రొకోలి చీజ్ స్టిక్స్ తయారీ విధానం”
“broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి”
“broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై
“Broccoli Manchurian | బ్రకోలి మంచూరియా తయారీ ఇలా..”