Broccoli Manchurian | బ్రకోలి మంచూరియా తయారీ ఇలా..

కావలసిన పదార్థాలు
బ్రకోలి ముక్కలు: రెండు కప్పులు, మైదా: అర కప్పు, కార్న్‌ఫ్లోర్: పావు కప్పు, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, సోయా సాస్: రెండు టీస్పూన్లు, చిల్లీ సాస్: ఒక టీస్పూన్, టమాట సాస్: ఒక టీస్పూన్, నూనె: తగినంత, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, వెల్లుల్లి: రెండు రెబ్బలు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా బ్రకోలి ముక్కలను రెండు నిమిషాలపాటు వేడినీళ్లలో వేసి, వడగట్టి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, కారం, ఒక టీస్పూన్ సోయా సాస్, తగినంత ఉప్పు వేసి నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. స్టవ్‌మీద వేయించడానికి సరిపడానూనె పెట్టుకుని బ్రకోలి ముక్కలని పిండి మిశ్రమంలో కలిపి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరోపాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనెవేసి, వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ వేయాలి. బాగా వేగాక టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అన్నీ బాగా మగ్గాక ఒక స్పూన్ సోయా సాస్, చిల్లీ సాస్, టమాట సాస్ వేసి పావుకప్పు నీళ్ళలో అర టీస్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి రెండు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు, వేయించి పక్కన పెట్టుకున్న బ్రకోలి ముక్కల్ని కలిపి, కొత్తిమీర చల్లుకుంటే మంచూరియా సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Broccoli
- Food
- gopi
- Manchurian
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

