విద్యా బాలన్ తొలి సంపాదన ఎంతో తెలుసా..?
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు విద్యాబాలన్. పదేళ్ల కిందట వచ్చిన డర్టీ పిక్చర్ సినిమా ఆమె రేంజ్‌నే మార్చేసింది.

బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు విద్యాబాలన్. పదేళ్ల కిందట వచ్చిన డర్టీ పిక్చర్ సినిమా ఆమె రేంజ్‌నే మార్చేసింది. అంతకుముందు పరిణీత, లగే రహో మున్నాబాయ్, గురు, పా వంటి సినిమాల్లో నటించినప్పటికీ.. డర్టీ పిక్చర్ సినిమా ఆమెను స్టార్‌ను చేసింది. ఈ సినిమాలో నటనతో ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకుంది. అప్పటి నుంచి మహిళా ప్రాధాన్య సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న విద్యాబాలన్.. ఇప్పుడు షేర్నీ సినిమాతో వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలపై అభిమానులతో ముచ్చటించింది. ఈ ఇంటర్వ్యూలోనే తన తొలి పారితోషికం గురించి కూడా ఓపెన్ అయిపోయింది.

అప్పట్లో ఓ టూరిస్టు క్యాంపైన్ కోసం తొలిసారి తాను కెమెరా ముందుకు వచ్చినట్లు గుర్తు చేసుకుంది విద్యాబాలన్ . తన స్నేహితులు, కజిన్స్‌తో కలిసి ఆ టూరిస్టు క్యాంపైన్ ఫొటోషూట్‌లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. ఆ ఫోటోషూట్‌లో తామంతా కూడా ఓ చెట్టు పక్కన నిలుచుని నవ్వుతుండాలని.. అలా నవ్వినందుకు తమకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చారని తెలిపింది. తన జీవితంలో అదే తొలి సంపాదన అని చెప్పింది విద్యా బాలన్. అలా 500 రూపాయలతో మొదలైన విద్య సంపాదన ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 కోట్లకు పైగానే తీసుకునే వరకు ఎదిగింది.

‘హమ్ పాంచ్’ అనే సీరియల్‌తో ఇండస్ట్రీకి వచ్చింది విద్యా బాలన్. హమ్ పాంచ్ సీరియల్ కోసం తొలి అడిషన్ ఇచ్చినపుడు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పింది విద్య. అప్పుడు తన అమ్మ, సోదరితో కలిసి ఆడిషన్‌కు వెళ్లానని.. సుమారు 150 మంది వరకూ ఆడిషన్స్‌కి వచ్చారని.. అంతమందిని అక్కడ చూసిన తర్వాత తనకు అవకాశం రాదని ముందుగానే ఫిక్స్ అయిపోయానని తెలిపింది విద్యా బాలన్. కానీ అదృష్టం కొద్ది అందులో నటించే ఛాన్స్ తనకు వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పహేలీ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. డర్టీ పిక్చర్ కు ముందు వరకు కూడా విద్యా కెరీర్ లో చాలా ఇబ్బంది పడింది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.
ఇవి కూడా చదవండి..
మహేశ్, ప్రభాస్ గురించి సుబ్బరాజు ఏమన్నాడంటే..?
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

