మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో నటనతో పాటు ఇతర టాలెంట్స్ కూడా మెండుగా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి వారు వాటిని బయటకు తీస్తుంటారు. ప్రస్తుతం షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన వరుణ్ తేజ్ తాజాగా తన ఇన్ స్టా వీడియోలో సరికొత్త నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తన ముక్కుపై కొన్ని సెకన్ల పాటు ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తిప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా,ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.
చివరిగా గద్దల కొండ గణేష్, ఎఫ్ 2 చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 చిత్రం చేస్తున్నాడు. అలానే గని అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ వలన ఆగిన ఈ మూవీ చిత్రీకరణ జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుంది. ఎఫ్ 3 చిత్ర షూటింగ్ కూడా అప్పుడే మొదలు కానుంది.