Bheema Movie | ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ ‘భీమా’.. ఎక్కడ చుడొచ్చంటే.?
Bheema Movie | టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.
Bheema Movie | టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా.. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా అలరించిన ఇందులో వెన్నెల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలకపాత్రల్లో నటించారు.
In only a few hours, Bhimaa will be all yours 💓
Watch the Trailer Now – https://t.co/CITN3AuxKQ#BhimaaonHotstar Streaming from Midnight!@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/KLxBiX5vhg
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 24, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది కర్ణాటకలోని పరశురామ క్షేత్రం- మహేంద్రగిరి. ఆ ప్రాంతంలో దివ్యఔషధ గుణములుండే మొక్కలు వుంటాయి. అలాగే ఓ మహిమ గల శివాలయం వుంటుంది. చనిపోయిన వారి చివరి కోరిక న్యాయ బద్దమైనదైతే, ఆ శివాలయంలో పూజలు చేస్తే ఆ కోరిక తీరుతుంది. అయితే అనూహ్యంగా ఆ గుడిని మూసివేయాల్సి వస్తుంది. సరిగ్గా ఐదు దశాబ్దాల తర్వాత అదే ఊరికి పోలీస్ ఇన్స్పెక్టర్ గా వస్తాడు భీమా (గోపీచంద్). తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న రౌడీ భవాని కి ఎలా బుద్ధి చెప్పాడు? ఈ కథలో రవీంద్ర వర్మ( నాజర్) పాత్ర ఏమిటి ? మూతపడిన గుడికి భీమాకి వున్న సంబంధం ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

