అన్నీ అబద్ధాలే.. ఓటీటీలోకి వకీల్ సాబ్ అప్పుడే రాదు
ఓటీటీలోకి వకీల్ సాబ్ | ఏప్రిల్ 23న అంటే వకీల్ సాబ్ విడుదలైన 14 రోజులకే ఓటీటీలో వచ్చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఓటీటీలో చాలా త్వరగా వచ్చేస్తుంది. మొన్నటికి మొన్న కన్నడలో పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన యువరత్న సినిమా కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేశారు. ఈ మధ్య తెలుగులోనూ అలా రెండు వారాల్లోనే సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. క్రాక్ మూడు వారాలకు.. మాస్టర్ రెండు వారాలకు ఓటీటీలో వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా రెండు వారాల్లోనే ఓటీటీలో వచ్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలు ధావాళంలా వ్యాపించాయి.
పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.58 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ.90 కోట్ల టార్గెట్‌తో దిగిన వకీల్ సాబ్ కచ్చితంగా ఉగాది పూర్తయ్యేలోపు టార్గెట్ పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. అయితే కరోనా కేసులు కూడా ఓ వైపు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలో వచ్చేస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఏప్రిల్ 23న అంటే వకీల్ సాబ్ విడుదలైన 14 రోజులకే ఓటీటీలో వచ్చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు కూడా అలాగే ఉండటంతో దాన్నే నిజమని నమ్మిన వాళ్లు కూడా లేకపోలేదు. అయితే అలాంటిదేం లేదని.. రూమర్స్ నమ్మొద్దని.. వకీల్ సాబ్ ఇప్పట్లో ఓటీటీలో విడుదల కాదంటూ క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దీని గురించే ప్రత్యేకంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. థియేటర్స్‌లో సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ దర్శక నిర్మాతలు చెప్తున్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో వస్తున్నట్లు సినిమా ఓటీటీలో మాత్రం విడుదల కాదని తేల్చేశారు. కావాలనే తమ సినిమాపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు వకీల్ సాబ్ నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
కరోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా ..?
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
కేటీఆర్ సర్.. మీరు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా?
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
హీరోయిన్‌పై నెమలి దాడి.. వీడియో వైరల్
పవర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువరత్న
దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

