గురువారం 28 మే 2020
Cinema - Apr 25, 2020 , 08:53:52

బాలీ‌వుడ్ న‌టి క‌న్నుమూత‌.. విషాదంలో హిందీ ప‌రిశ్ర‌మ‌

బాలీ‌వుడ్ న‌టి క‌న్నుమూత‌.. విషాదంలో హిందీ ప‌రిశ్ర‌మ‌

ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి ఉషా గంగూలీ (75) గుండె పోటుతో మ‌ర‌ణించారు. దక్షిణ కోల్‌కతాలో నివాసముంటున్న ఆమె తన ఫ్లాట్‌లో  విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్స్ తెలిపారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మ‌ర‌ణ వార్త విని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ అయ్యారు. ఆమె మ‌రణం నాట‌క రంగానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు.

జోధ్‌పూర్‌‌లో జన్మించిన ఉషా గంగూలీ.. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకొని హిందీ సాహిత్యం నేర్చుకోవడానికి కోల్‌కతాకు వచ్చారు. ఆ సమయంలోనే నాటక రంగంలో ప్రవేశించి మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్స్, ఆంతర్యాత్ర లాంటి నాటకాల్లో నటించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు.  ఉషా గంగూలీ మరణవార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సంతాపం తెలియజేశారు.  కొందరు కుటుంబ సభ్యుల మధ్య ఆమె అంత్యక్రియలు ముగిశాయి.logo