కుర్ర హీరోలను కట్టి పడేస్తున్న మహేష్ బాబు
మహేష్ బాబు | కుర్రహీరోలను కట్టి పడేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ట్విస్ట్ ఉంది. సినిమాలు, యాడ్స్‌లో నటిస్తూనే థియేటర్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నాడు.

మహేష్ బాబు కుర్రహీరోలను కట్టి పడేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమాలు, యాడ్స్‌లో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా థియేటర్ బిజినెస్‌లోనూ మహేష్ రాణిస్తున్నాడు. నటుడిగా, బిజినెస్‌మ్యాన్‌గా దూసుకుపోతున్న మహేష్.. ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తా చూపించాలని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు నిర్మించాడు సూపర్‌స్టార్. కాకపోతే అందులో తానే హీరోగా నటించాడు. బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు ఇతర హీరోలతోనూ వరుస సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఘట్టమనేని మహేష్ బాబు ప్రొడక్షన్లో ఇప్పుడు మేజర్ సినిమా వస్తుంది. అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియన్ సబ్జెక్టుతో ఈ సినిమాను తీసుకొస్తున్నాడు అడవి శేష్. 2008 ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుంది.

ఇదిలా ఉంటే మేజర్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా నిర్మించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు మహేష్ బాబు. దీనికోసం కథ చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయ్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే మహేష్ బాబు ప్రొడక్షన్లో కొత్త సినిమా మొదలు కానుంది. ఈ నిర్మాణ సంస్థ పనులన్నీ నమ్రత శిరోద్కర్ దగ్గరుండి చూసుకుంటోంది.

తాజాగా మరో హీరో కూడా మహేష్ బాబు నిర్మాణ సంస్థలో పని చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు వంటి సూపర్ డూపర్ హిట్లతో మంచి జోరు మీద ఉన్న నవీన్ పొలిశెట్టి హీరోగా చలో, భీష్మ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాను మహేష్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు వెంకీ. దానికంటే ముందు నవీన్- వెంకీ కుడుముల సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా టాలెంట్ ఉన్న యంగ్ హీరోలను తన నిర్మాణ సంస్థలో ప్రోత్సహిస్తున్నాడు మహేష్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్: క్రిష్
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్
చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
లవ్ స్టోరీ విడుదల వాయిదా..? మేకర్స్ క్లారిటీ
రామ్‌సేతులో అక్షయ్ కుమార్ లుక్ ఇదేనా ?
కారు ప్రమాదంలో యువ గాయకుడు మృతి
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
‘వైల్డ్ డాగ్’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉండబోతుంది?
రెండు సాంప్రదాయాలలో మెహ్రీన్ కౌర్ వివాహం..!
పొట్టి దుస్తులలో అనసూయ హోలీ సంబురాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

