నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన అఖండ థియేటర్లలో విడుదలై కేక పుట్టిస్తోంది. మంచి ఓపెనింగ్స్, అదిరిపోయే టాక్‌తో ఖాతా తెరిచిన అఖండ రికార్డుల దిశగా ముందుకెళ్లడం ఖాయమనిపిస్తోంది. బోయపాటి శ్రీను (Boyapati Sreenu) డైరెక్షన్లో మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు రియాక్ట్ అయ్యాడు.
అఖండ భారీ ఓపెనింగ్స్ తో షురూ అయిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. చప్పట్లు కొడుతూ నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీను, టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. బాలయ్య సినిమాపై మహేశ్ బాబు (Mahesh babu) ట్వీట్ చేయడంతో అఖండపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. మహేశ్ బాబు పెట్టిన ట్వీట్ బిజినెస్ పరంగా అఖండ నిర్మాతలకు బాగానే కలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే బాలకృష్ణ, మహేశ్‌బాబు డిజిటల్ ప్లాట్ ఫాం ఆహాలో Unstoppable షోలో సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ పెట్టిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Extremely happy to hear that #Akhanda has had a massive start! 👏👏 Congratulations to #NandamuriBalakrishna garu, #BoyapatiSreenu garu and the entire team! @ItsMePragya @MusicThaman @dwarakacreation
— Mahesh Babu (@urstrulyMahesh) December 2, 2021
మరోవైపు శ్రీకాంత్ విలన్ గా స్టన్నింగ్ యాక్టింగ్ తో అదరగొట్టాడని అంటున్నా సినీ జనాలు.
ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్గా నటించగా.. పూర్ణ (Poorna)కీలక పాత్రలో నటించింది. జగపతిబాబు కీ రోల్ పోషించాడు.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు