తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
తరుణ్ | ఎన్నో ఏళ్ల తర్వాత తరుణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.

మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన హీరో తరుణ్. అప్పటికే బాలనటుడిగా ఎన్నో అవార్డులు విమర్శకుల ప్రశంసలు అందుకున్న తరుణ్.. నువ్వేకావాలి సినిమాతో తరుణ్ హీరోగా మారాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. నువ్వే కావాలి తర్వాత నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే లాంటి విజయవంతమైన సినిమాలతో స్టార్ హీరోగా మారాడు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
ఇప్పటికీ ఈయన అంటే చాలా మందికి ఇష్టం. అయితే చిన్న చిన్న పొరపాట్లు చేయడంతో కెరీర్లో ఒక్కసారిగా వెనుకబడిపోయాడు తరుణ్. అప్పటి వరకు మంచి రైజింగ్‌లో ఉన్న కెరీర్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది.
2009లో కృష్ణవంశీ తెరకెక్కించిన శశిరేఖా పరిణయం సినిమా తర్వాత ఈయనకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు.
ఇక విజయాల సంగతి పూర్తిగా పక్కన పెట్టాలి. ఎందుకంటే తరుణ్‌తో సినిమా చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. దాంతో పూర్తిగా బిజినెస్‌పై దృష్టి పెట్టాడు ఈయన.
కొన్నేళ్లుగా తరుణ్ నుంచి సినిమాలు రావడం లేదు. గత 14 ఏళ్లలో ఈయన నుంచి కేవలం 6 సినిమాలు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఆయన కెరీర్ ఎంత డైలమాలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చివరగా 2018లో ఇది నా లవ్ స్టోరీ అంటూ వచ్చాడు తరుణ్. అయితే ఈ సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.

ఎన్నో ఏళ్ల తర్వాత తరుణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈయన తన స్నేహితుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీలైనంత త్వరలో విడుదల చేయనున్నాడు తరుణ్. ఇందులో నటించబోయే ఆర్టిస్టుల వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో తరుణ్ ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మేఘనా రాజ్: చిరంజీవి సర్జా భార్య ఏం చేస్తుంది?
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పుష్ప విలన్ పారితోషికం వింటే షాకే..!
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
‘జాతి రత్నాలు’ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు తగ్గట్లేదు
కరోనా రెండో దశ వచ్చిందా.. ఇండస్ట్రీ పరిస్థితేంటి?
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
పవన్ సినిమాతో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెనింగ్
అమాంతం రేటు పెంచిన జాతిరత్నం.. పర్లేదు అంటున్న నిర్మాతలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

