Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Ganja Delivery Racket | ఆహారాన్ని అందించే డెలివరీ బ్యాగుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు.
Ganja Delivery Racket | ఇబ్రహీంపట్నం/మంచాల, అక్టోబర్ 23 : ఆహారాన్ని అందించే డెలివరీ బ్యాగుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ముసు గులో దర్జాగా తిరుగుతూ… గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరు నిందితులను మహేశ్వరం ఎస్వోటీ పోలీ సులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్నారు.
మహేశ్వరం ఎస్వీటీ పోలీసులు, మంచాల పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అరకు ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు ప్రదీప్ నుంచి రవి, సుకేశ్ బాబు అనే వ్యక్తులు విజయవాడ కేంద్రంగా గంజాయిని కొని అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పోలీ సుల కండ్లు కప్పేం దుకు స్విగ్గీ, జొమాటో బ్యాగులను సాధనంగా ఎంచుకున్నారు. ఆహార పదార్థాల డెలివరీ సిబ్బందిలా పలు కాలనీల్లో తిరుగుతూ తమ నెట్వర్క్ లోని రెగ్యులర్ వినియోగదారులకు గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నారు. కాగా, శుక్రవారం మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు సాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం, ఆగాపల్లి పరి సర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా డెలివరీ బ్యాగులతో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 1.1 కేజీల ఎండు గంజాయి, ఏపీ 29పీ 8911 నంబర్ల సిటీ 100 బైక్, గంజాయిని తూకం వేసే మిషన్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని మంచాల పోలీసులకు అప్పగించగా.. వారు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ హాస్టళ్లు విచ్చలవిడిగా పెరుగుతుండటంతో కొందరు గంజాయి విక్రయదారులు విద్యార్థులను గంజాయి మత్తులోకి దింపుతున్నారు. అలాగే, పరిసర ప్రాంతాల్లో పాన్ ప్లు, స్మోకింగ్ జోన్స్ తోపాటు చిన్నచిన్న షాపుల్లోనూ గంజాయిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

