కరోనా రెండో దశ వచ్చిందా.. ఇండస్ట్రీ పరిస్థితేంటి?
Tollywood: కరోనా రెండో దశ అనే మాటే దర్శక నిర్మాతలను వణికించేలా చేస్తుంది. ఇప్పటికే 10 నెలల పాటు థియేటర్స్ మూసుకుని.. డిసెంబర్ నుంచి ఓపెన్ చేశారు.
కరోనా రెండో దశ అనే మాటే దర్శక నిర్మాతలను వణికించేలా చేస్తుంది. ఇప్పటికే 10 నెలల పాటు థియేటర్స్ మూసుకుని.. డిసెంబర్ నుంచి ఓపెన్ చేశారు. అది గాడిన పడటానికి మరో నెల రోజులు పట్టింది. సంక్రాంతి నుంచి వసూళ్లు వచ్చాయి. క్రాక్, మాస్టర్, రెడ్ లాంటి సినిమాలు పండక్కి వచ్చి పండగ చేసుకున్నాయి. దాంతో మనకు మంచి రోజులు వచ్చాయని పండగ చేసుకున్నారు నిర్మాతలు. అయితే అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది.

ఉప్పెన, జాతి రత్నాలు లాంటి సంచలన విజయాలు సాధించిన తర్వాత ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ కానీ 50 శాతం ఆక్యుపెన్సీ కానీ విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
ఇదే జరిగితే తెలుగు ఇండస్ట్రీకి అంతకంటే పెద్ద దెబ్బ మరోటి లేదు. 2021 అంతా కనీసం 40 సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఏడాది పొడుగునా విడుదల తేదీలు కూడా ప్రకటించారు దర్శక నిర్మాతలు.
ఇలాంటి సమయంలో కరోనా రెండో దశ అంటే వణికిపోతున్నారు నిర్మాతలు. ఈ మాట వింటేనే గుండె దడ మొదలవుతుంది వాళ్లకు. ఎందుకంటే ఒకటి రెండు కాదు.. కరోనా కారణంగా ఇప్పటికే 10 వేల కోట్లకు పైగా నష్టపోయింది సినిమా ఇండస్ట్రీ.
ఇంకా సరిగ్గా ఓపెన్ కానీ థియేటర్లు
తెలుగు రాష్ట్రాలు మినహా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ సరిగ్గా ఓపెన్ చేయలేదు.. మన దగ్గర పరిస్థితి ఇప్పుడిప్పుడే చక్కబడుతుందనుకునే సమయానికి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
క్రాక్, జాతి రత్నాలు లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో సహా.. నాంది, మాస్టర్ లాంటి విజయాలు వచ్చాయి ఈ ఏడాది.
కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా ఇండస్ట్రీపై ప్రభావం దారుణంగా పడేలా కనిపిస్తుంది. ఇప్పుడు రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
నెల రోజుల కింద రోజుకు ఇండియాలో 5 వేల కేసులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40 వేలు దాటిపోయింది.
ఏపీ, తెలంగాణలో కూడా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దాంతో రెండు ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి.
లాక్ డౌన్ లేకపోయినా కూడా మళ్లీ థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు జారీ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది.
కర్ణాటకలో ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చేసింది ప్రభుత్వం. మహారాష్ట్ర లాంటి చోట్ల అయితే అసలు థియేటర్స్ వైపు ప్రేక్షకులు రావడమే మానేశారు.
ఇలాంటి సమయంలో వకీల్ సాబ్, ఆచార్య, కేజీయఫ్ 2, రాధే శ్యామ్.. ఇలాంటి భారీ సినిమాల పరిస్థితి ఏమవుతుందో ఊహించడమే కష్టమవుతుంది.
ఇవి కూడా చదవండి..
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
జలపాతంలా హంసానందిని నయగారాలు
పింక్ రీమేక్‌కు ‘వకీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేదట..!
ఫేక్ అకౌంట్స్ నమ్మోద్దంటూ వైష్ణవ్ తేజ్ ప్రకటన
ఎవరు మీలో కోటీశ్వరులు న్యూ ప్రోమో
సీటీమార్ నుండి పెప్సీ ఆంటీ మాస్ మసాలా సాంగ్ విడుదల
నేను దేశ భక్తురాలిని.. అవినీతిపరురాలిని కాదు: కంగనా రనౌత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

