Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Samantha | ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా సెప్టెంబర్ నెలకు సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితా విడుదల చేయగా, ఇందులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. సమంత మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుంది.
Samantha | ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా సెప్టెంబర్ నెలకు సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితా విడుదల చేయగా, ఇందులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. సమంత మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు సాయిపల్లవి, నయనతార ర్యాంకులు తగ్గాయి. కాజల్ అగర్వాల్ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా, త్రిష తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా, ఓర్మాక్స్ మీడియా జాబితాలో సమంత మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆమె, సెప్టెంబర్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
మధ్యలో కొన్ని సందర్భాల్లో ర్యాంకులో మార్పులు వచ్చినప్పటికీ, తిరిగి మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. సినిమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ అభిమానులకు అందుబాటులో ఉండటం ఆమెకు కలిసొస్తోంది. ఈ జాబితాలో రష్మిక మందన్నా అత్యంత కీలకమైన పురోగతి సాధించింది. ఆగస్టు నెలలో ఏడో స్థానంలో ఉన్న ఆమె, సెప్టెంబర్ నాటికి మూడు స్థానాలు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో రెండో స్థానంలో అలియా భట్, మూడో స్థానంలో దీపికా పదుకొణె నిలిచారు. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘మైసా’, ‘రాకా’, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలోనూ ఆమె నటిస్తుంది. వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల్లో ఆమెపై ఆసక్తి కొనసాగుతోంది.
మరోవైపు సాయిపల్లవి సెప్టెంబర్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఆగస్టులో నాలుగో స్థానంలో ఉన్న ఆమె, ఇప్పుడు ఒక స్థానం దిగజారింది. ప్రస్తుతం ‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి, ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కాజల్ అగర్వాల్ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆగస్టులోనూ ఇదే స్థానంలో ఉన్న ఆమెకు సెప్టెంబర్ జాబితాలో మార్పు కనిపించలేదు. మరోవైపు లేడీ సూపర్‌స్టార్ నయనతారకు మాత్రం ర్యాంకులో మార్పు వచ్చింది. ఆగస్టులో ఐదో స్థానంలో ఉన్న ఆమె, సెప్టెంబర్‌లో ఏడో స్థానానికి పడిపోయింది. ఓర్మాక్స్ మీడియా సెప్టెంబర్ జాబితాలో ఎనిమిదో స్థానంలో కృతి సనన్, తొమ్మిదో స్థానంలో త్రిష, పదో స్థానంలో కత్రినా కైఫ్ ఉన్నారు. మరోవైపు శ్రీలీల ఈసారి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

