సెప్టెంబర్ 20..నేడు టాలీవుడ్ (Tollywood) లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్రావు (Akkineni Nageswara Rao) జయంతి. నాగేశ్వర్ రావు ఎన్నో సినిమాల్లో పంచెకట్టులో కనిపించి ఆ వస్త్రాలకే అందాన్ని తీసుకొచ్చారు. తన తండ్రి జయంతి సందర్భంగా అక్కినేని నాగార్జున (Nagarjuna) స్పెషల్ వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. బంగార్రాజుగా పంచెకట్టులో ఎలా అలరించబోతున్నాడో..నాగేశ్వర్ రావు ను గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చాడు నాగ్.
సెప్టెంబర్ 20వ తారీఖు..నాకు చాలా ముఖ్యమైన రోజు. నా హీరో..నా ఇన్స్పిరేషన్ నాన్నగారి పుట్టినరోజు. నాన్నకు పంచెకట్టు అంటే చాలా ఇష్టం. ఆయన పంచెకట్టుకున్నపుడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేసేది. ఆయనకు పొందూరి ఖద్దర్ అంటే చాలా ఇష్టం. ఇదిగో ఇది పొందూరి ఖద్దరే. ఇది ఆయన నవరత్నాల హారం. ఆయన నవరత్నాల ఉంగరం. ఈ వాచ్ నాకన్న సీనియర్
Remembering ANR garu on his birthday and everyday ! He is with us always !! #ANRLivesOn
— BA Raju's Team (@baraju_SuperHit) September 20, 2021
-Team Bangaraju #ANR #BangarRaju #LegendANRJayanthi pic.twitter.com/3bUQp21zdi
ఆయన ఫేవరేట్ వాచ్ ఇపుడు నా ఫేవరేట్ వాచ్. ఇవన్నీ వేసుకుంటే ఆయన నాతోనే ఉన్నట్టుంటుంది. ఏదో తృప్తి. నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ మా ప్రయత్నం అంటూ నాగార్జున విడుదల చేసిన ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!