సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 09:33:46

ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు బెదిరిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు బెదిరిస్తున్నారు.

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు కొందరు తనను బెదిరిస్తున్నారని నటి పాయల్‌ ఘోష్‌ చెప్పారు. బెదిరింపులు వస్తున్నందుకే తాను డైరెక్ట్‌ మెస్సేజ్‌ ఆఫ్షన్‌ను తొలగించినట్లు తెలిపారు. ఇటీవల పాయల్‌ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ తారక్‌ మంచి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని, సినిమా గురించి ఆయన పడే కష్టం ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు.

‘నేను తారక్‌కు మద్దతుగా నిలబడడానికి కారణం మీరెప్పటికీ అర్ధం చేసుకోలేరు.  ఆయనపై జాలి పడండి. ఆయన గతం గురించి తెలిసి నేను ఏడ్చాను. నన్ను బెదిరించడం కొంతమందికి క్రేజ్‌లా మారింది. ఎన్టీఆర్‌ను చూసి గర్వపడండి’ అని పాయల్‌ ట్వీట్‌ చేసింది. ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉన్నానని, సోషల్‌ మీడియాలో తనను దూషించడం ఆపాలని కోరింది.logo