
Akhanda background score | సాధారణంగానే తమన్కు ఇండస్ట్రీలో ఆర్ఆర్ బాగా ఇస్తాడని పేరుంది. అందుకే ఆయన్ను పెద్ద దర్శకులు ఏరికోరి తీసుకుంటారు. పాటలు అలా అలా ఇచ్చినా కూడా.. రీ రికార్డింగ్ మాత్రం ఇరక్కొడతాడు తమన్. ముందు వెనక చూడకుండా బాక్సులు బద్దలైపోతాయి. కేవలం ఆయన ఆర్ఆర్తో అదిరిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి తమన్ విశ్వరూపం చూపించాడు. తాజాగా బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన ఆర్ఆర్ చూసిన తర్వాత వామ్మో అనుకుంటున్నారంతా. ముందు నుంచి ఈ చిత్రం గురించి చెప్తూనే ఉన్నాడు తమన్. కచ్చితంగా చూసాక మీరు షాక్ అవుతారు.. బాలయ్యను ఇప్పటి వరకు అలా ఎవరూ చూసుండరు.. రీ రికార్డింగ్ తో చూసిన తర్వాత నాకు చాలా సార్లు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాడు తమన్.

పని చేస్తున్న సినిమాలకు ఎవరైనా అలాగే చెప్తారులే అని లైట్ తీసుకున్నారంతా. కానీ ఇప్పుడు విడుదలైన తర్వాత చూస్తే తమన్ చెప్పింది నిజమే అని నమ్మక తప్పడం లేదు. సినిమా కథ రొటీన్గానేఉంది.. కానీ తమన్ ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం పేలిపోయింది. థియేటర్స్లో సౌండ్ బాక్సులు బద్ధలైపోతున్నాయి. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనే రేంజ్లో రెచ్చిపోయాడు తమన్. ఆయన రీ రికార్డింగ్తోనే అఖండ సినిమా రేంజ్ పెరిగిపోయింది. రేపు సినిమా కానీ కమర్షియల్గా సేఫ్ అయిందంటే ఆ క్రెడిట్లో సింహభాగం కచ్చితంగా తమన్ తీసుకోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తన కెరీర్లోనే బెస్ట్ బీజీఎమ్ బాలయ్య కోసమే ఇచ్చాడని అంటున్నారు.
కెరీర్లో 130 సినిమాలకు పైగానే పని చేశాడు తమన్. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఈ స్థాయి ఆర్ఆర్ ఆయన కొట్టలేదంటే అతిశయోక్తి కాదేమో..? మొదటి సీన్ నుంచి చివరి వరకు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అఖండకు శ్రీరామరక్ష. కేవలం ఆయన ఆర్ఆర్తోనే చాలా సన్నివేశాలు రుద్రతాండవం చేశాయి. మాస్ ఆడియన్స్ కు ఇంతకంటే కావాల్సిందేం లేదు. సింగిల్ స్క్రీన్స్ అయితే కచ్చితంగా బాలయ్య అప్పియరెన్స్.. థమన్ వాయింపుకు షేక్ అయిపోవడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
Akhanda : అఖండ దెబ్బకు భయపడుతున్న అమెరికా థియేటర్లు
Akhanda movie review | అఖండ సినిమా రివ్యూ
Akhanda : బాలయ్య అభిమానుల రచ్చ.. ఆస్ట్రేలియాలో షో రద్దు చేసిన పోలీసులు
ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎంత.. లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం..
Akhanda benefit show | అఖండ సినిమా హైదరాబాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తెలుసా..?