Akhanda in USA theaters | సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో రూపొందిన చిత్రం అఖండ. ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు అందరు చిత్రానికి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చర్చించుకుంటున్నారు. అఖండ లాంటి మాస్ సినిమాకి అదిరిపోయే బీట్స్ ఇచ్చావని ప్రశంసలు కురిపిస్తున్నారు.
బీజీఎంతో బాలయ్య ప్రేక్షకులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అఘోరాగా బాలయ్య సృష్టించిన విధ్వంసానికి, బోయపాటి మాస్ ఎలివేషన్స్ కి తమన్ వీర కొట్టుడు మ్యూజిక్ తోడవటంతో థియేటర్స్ లో బాక్సులు బద్దలైపోతున్నాయని అంటున్నారు.ఈ క్రమంలో ఓ సినిమా థియేటర్ హాల్ బయట పెట్టిన ఓ నోటిస్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అమెరికాలోని సినీమార్క్ అనే మల్టిప్లెక్స్ ఓ నోటీస్ బోర్డ్ పెట్టింది. అఖండ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మా స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే సౌండ్ కొంచెం తగ్గించి సినిమాని చూపిస్తాము అంటూ నోటీసులు పెట్టారు. ఈ నోటీసులు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. థమన్ అన్నా కొంచెం చూసి కొట్టు అన్నా, స్పీకర్స్ పగిలిపోతున్నాయంటా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
@MusicThaman koncham choosi kottu anna 😂 speakers pagulthunnai anta. Mass BGM ichav, mainly aghora 🔥🔥 #Akhanda #Nbk #Jaibalayya #AkhandaMassJathara pic.twitter.com/4zkczLqevQ
— NewYork_DUDE (@NewYorkVaasi) December 2, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
Akhanda movie review | అఖండ సినిమా రివ్యూ
Akhanda : బాలయ్య అభిమానుల రచ్చ.. ఆస్ట్రేలియాలో షో రద్దు చేసిన పోలీసులు
ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎంత.. లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం..
Akhanda benefit show | అఖండ సినిమా హైదరాబాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తెలుసా..?