AP Movie tickets | ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కూడా అది కుదరడం లేదు. అయితే ఈ క్రమంలోనే రాష్ట్రంలో సినిమా టికెట్లకు సంబంధించిన కొత్త ధరలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం.. బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను నిర్ణయించింది. ఈ మేరకు ధరలను విడుదల చేసింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది.
మున్సిపల్ కార్పొరేషన్లు:
మల్టీప్లెక్సు: ప్రీమియం రూ.250, డీలక్స్: రూ.150, ఎకానమీ: రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీలు:
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీలు:
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీలు:
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
టికెట్ రేట్లు పెంచుకోండి.. థియేటర్స్ యాజమాన్యానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
Akhanda Benefit shows | అఖండ బెనిఫిట్ షోకు గ్నీన్ సిగ్నల్..ఈ రెండు థియేటర్లలోనే..
Ruhani Sharma | చిలసౌ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ !