టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తోన్న చిత్రం అఖండ (Akhanda). బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కాగా అఖండ మూవీ బెనిఫిట్ షోల (Benefit shows) స్క్రీనింగ్‌కు హైదరాబాద్‌లోని రెండు థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్జికార్జున థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించుకుందనేందుకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ప్రభుత్వం ఈ స్పెషల్ షోలకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పించింది. అఖండ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ఈ థియేటర్లలోనే ప్రీమియర్ కానుంది. గురువారం ఉదయం 4: 30 గంటలకు అఖండ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్ కనిపించనుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన సాంగ్స్ కు ఇప్పటికే అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇవి కూడా చదవండి..
Mahesh Chiranjeevi Donations | ఏపీ వరద బాధితులకు చిరంజీవి, మహేశ్‌బాబు భారీ విరాళం
Sirivennela Last wish | చివరి వరకు సిరివెన్నెలకు ఆ ఒక్క కోరిక అలాగే మిగిలిపోయింది..
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ