ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు (AP Floods) వరదలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఏపీలోని నెల్లూరు, తిరుపతితోపాటు పలు రాయలసీమ ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. తీవ్ర ఆస్థి నష్టం సంభవించడంతోపాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద విపత్తుతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు మేమున్నామంటూ టాలీవుడ్ (Tollywood) ప్రముఖులు ముందుకొస్తున్నారు.
ఇప్పటికే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Aravind) సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలు విరాళంగా అందించగా..టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu),రాంచరణ్ కూడా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు.
Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021
ఆంధ్రప్రదేశ్‌లో వరదల విపత్తు కుటుంబాలకు నా వంతు సాయంగా రూ.25 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా..అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Super Star @urstrulyMahesh Donates INR 25Lakhs to CMRF towards Andhra Pradesh flood victims.@ysjagan @AndhraPradeshCM pic.twitter.com/CgaXfPNrEd
— BA Raju's Team (@baraju_SuperHit) December 1, 2021
ఆంధప్రదేశ్‌లో ఇటీవల విధ్వంసకరమైన వరదల కారణంగా నష్టపోయిన వారికి నా వంతు సహాయం అందించడంలో భాగంగా సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు అందిస్తున్నా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ముందుకొచ్చి ఏపీకి తమ వంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ట్వీట్ చేశారు మహేశ్‌బాబు.
Heart feels heavy to see the suffering of people in AP due to devastating floods. Making a modest contribution of 25L towards Chief Minister Relief Fund to help with the relief works. @ysjagan @AndhraPradeshCM
— Ram Charan (@AlwaysRamCharan) December 1, 2021
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు