చిలసౌ, హిట్, డర్టీ హరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రుహానీ శర్మ (Ruhani Sharma). ఇటీవలే శ్రీనివాస్ అవసరాలతో కలిసి నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో మెరిసింది. ఈ భామ ఇక హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ చిత్రాన్ని విక్రాంత్ మెస్సీతో కలిసి చేస్తోంది రుహానీ శర్మ. కొత్త డైరెక్టర్ దేవాంగ్ భావ్సర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇటీవలే ఆడిషన్స్ నిర్వహించిన మేకర్స్ రుహానీ శర్మ లుక్కు ఇంప్రెస్ అయి సినిమాకు ఎంపిక చేశారని బీటౌన్ వర్గాల సమాచారం. థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రంలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఎంతో కాలంగా బాలీవుడ్‌కు వెళ్లాలన్న కల నెరవేరుతుండటంతో ఆనందంలో ఎగిరిగంతేస్తుంది రుహానీ శర్మ. మరి హిందీలో రుహానీ శర్మ ఎలా అలరిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Mahesh Chiranjeevi Donations | ఏపీ వరద బాధితులకు చిరంజీవి, మహేశ్‌బాబు భారీ విరాళం
Sirivennela Last wish | చివరి వరకు సిరివెన్నెలకు ఆ ఒక్క కోరిక అలాగే మిగిలిపోయింది..
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ