అఖండ సినిమా హైదరాబాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తెలుసా..?

akhanda movie benefit show ticket price | ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా అఖండ. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ కూడా అలాగే ఉంది. బాలకృష్ణ కొత్త సినిమాలతో సంబంధం లేకుండా అఖండకు ఏకంగా 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ అలా ఉంది మరి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మారిన నియమాల ప్రకారం ఏ సినిమాకు కూడా బెనిఫిట్స్ వేయడానికి వీలు లేదు. దాంతో నందమూరి అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే తెలంగాణలో అలాంటి ఆంక్షలు ప్రభుత్వం విధించలేదు. దాంతో ఇక్కడ అతి కష్టం మీద హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతులు తెచ్చుకున్నారు నిర్వాహకులు. దాంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
టికెట్ ధర ఎంతైనా పర్లేదు థియేటర్లో మాస్ జాతర జరగాల్సిందే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. దానికి తోడు చాలా రోజులుగా నందమూరి కుటుంబం నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దాంతో బాలయ్య అభిమానులు ఆకలితో ఉన్నారు. డిసెంబర్ 2న తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లో బెనిఫిట్ షోస్ ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ధర ఏకంగా రూ 3500 నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. అయినా కూడా నందమూరి అభిమానులు ఓకే అంటున్నారు.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఆంధ్రా నుంచి 350 మంది అభిమానులు ఏకంగా బస్సులు మాట్లాడుకొని వస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బాలకృష్ణ ఇమేజ్ గురించి.. ఆయనకు ఉన్న మాస్ స్టామినా గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేకుండాపోయింది. కచ్చితంగా బెనిఫిట్ షో నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ లో అఖండ మాస్ జాతర మొదలయ్యేలా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎంత.. లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం..
టికెట్ రేట్లు పెంచుకోండి.. థియేటర్స్ యాజమాన్యానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
Akhanda Benefit shows | అఖండ బెనిఫిట్ షోకు గ్నీన్ సిగ్నల్..ఈ రెండు థియేటర్లలోనే..
Ruhani Sharma | చిలసౌ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

