సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసుకదా’. ైస్టెలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హృదయాన్ని స్పృశించే అందమైన ప్రేమకథా చిత్రమిది.
కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి. నేటి జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథాంశమిది. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ బాబా, సంగీతం: తమన్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతిప్రసాద్, రచన-దర్శకత్వం: నీరజ కోన.