IPL 2025 : పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ పడింది. క్వాలిఫయర్ 2లో అజేయ అర్థ శతకంతో జట్టును గెలిపించిన శ్రేయాస్ అయ్యర్(1) ఔటయ్యాడు. షెపర్డ్ బౌలింగ్‌లో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా ఆడాలనుకున్న అతడు వికెట్ కీపర్ జితేశ్ చేతికి చిక్కాడు. అయ్యర్ వికెట్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు షెపర్డ్. అయితే.. జోష్ ఇంగ్లిస్(39) మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. కృనాల్, షెపర్డ్ ఓవర్లో ఒక్కో సిక్సర్ బాదిన అతడు జట్టు స్కోర్ 90 దాటించాడు. 12 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 98-3. ఇంకా విజయానికి 93 రన్స్ కావాలి.
బెంగళూరు నిర్దేశించిన భారీ ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు దంచి కొట్టారు. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రియాన్ష్ ఆర్య(24) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే.. ప్రభ్‌సిమ్రన్(26) సింగ్‌కు 9 పరుగుల వద్ద లైఫ్ లభించింది. హేజిల్‌వుడ్ ఓవర్లో అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను షెపర్డ్ నేలపాలు చేశాడు. చేతుల్లో పడిన బంతిని ఒడసి పట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత హేజిల్‌వుడ్ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదిన ప్రియాన్ష్.. చివరకు అతడి ఓవర్లోనే వెనుదిరిగాడు.